Half Day Classes: రేపటి నుంచి ఒంటిపూట బడులు
హైదరాబాద్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులను ప్రారంభించనున్నారు. పాఠశాలలు విధిగా ఒంటిపూట తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏప్రిల్ 24 వరకు తరగతులు కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల యాజమాన్యాలు ఈ ఉత్తర్వులను అమలు చేయాలని పేర్కొంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి పనిచేస్తాయి. మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు కొనసాగించాలి. భోజనాన్ని మధ్యాహ్నం 12.30 గంటలకు అందించాలి. ఎస్‌ఎ్‌ససీ పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలి.
0 Comments:
Post a Comment