Govt Jobs: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గుడ్‌న్యూస్... AEE ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్..!
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు స్పెషల్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి.
తాజాగా ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (OPSC) ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. వివిధ విభాగాల్లో AEE పోస్టుల నియామక ప్రక్రియను ప్రారంభించింది.తాజా రిక్రూట్‌మెంట్ ద్వారా ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (OPSC) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (మెకానికల్) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఓపీఎస్‌సీ అధికారిక పోర్టల్ opsc.gov.in ద్వారా మార్చి 29 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ గడువు ఏప్రిల్ 28తో ముగియనుంది.
* అర్హత ఏంటి?
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థుల వయసు 2023 జనవరి 1 నాటికి 23-38 ఏళ్ల మధ్య ఉండాలి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. ఏఈఈ (మెకానికల్) పోస్టులకు అప్లై చేసేవారు మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉండాలి. లేకపోతే వీటికి సమానమైన కోర్సులను గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లలో పూర్తి చేయాలి. లేదా, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆఫ్ ఇండియాలో సివిల్ లేదా మెకానికల్‌లో అసోసియేటెడ్ మెంబర్స్‌గా ఉండడం తప్పనిసరి.
* ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపికలో గేట్(Graduate Aptitude Test in Engineering) స్కోర్ కీలకం కానుంది. ఒరిజినల్ సర్టిఫికెట్స్, చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్ వెరిఫికేషన్ తర్వాత, అర్హత ఉన్న అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
* అప్లికేషన్ ప్రాసెస్
- అభ్యర్థులు OPSC అధికారిక పోర్టల్ opsc.gov.in విజిట్ చేయాలి.
- హోమ్ పేజీలో 'APPLY ONLINE' అనే లింక్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
- దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు అవసరమైన వివరాలతో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది.
- ఆ తరువాత లాగిన్ అయి సంబంధిత పోస్ట్ కోసం అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్‌లో అన్ని వివరాలను ఎంటర్ చేసి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. చివరకు అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయాలి.
* భర్తీ కానున్న పోస్టుల వివరాలు
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా OPSC మొత్తం 391 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) పోస్టులు 362 కాగా, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (మెకానికల్) పోస్టులు 29 ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కు అప్లై చేసుకునే సమయంలో అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. అప్లికేషన్ ఫారమ్‌ను నింపే సమయంలో అభ్యర్థులు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) పోస్ట్ కోసమైతే వారి ప్రాధాన్యత/డిపార్ట్‌మెంట్స్ ఛాయిస్‌ను తప్పనిసరిగా తెలియాజేయాల్సి ఉంటుంది.
0 Comments:
Post a Comment