Good News to Employees: ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మార్చి నెలాఖరులోగా పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు అంగీకారం తెలిపింది..
ఈ నెలాఖరులోగా సుమారు రూ. 3 వేల కోట్ల మేర పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేసింది ప్రభుత్వం.. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ముగిశాయి.. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం.. అందరూ కలిస్తేనే.. ప్రభుత్వ లక్ష్యాలను సాధించడం సాధ్యం అనే స్పృహతోనే ఉన్నాం అన్నారు.. కోవిడ్ వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి.. ఆ ప్రభావం ఏపీ మీద కూడా పడింది.. ఆ క్రమంలోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం అన్నారు. వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మేం ప్రయత్నిస్తూనే ఉన్నాం అని తెలిపారు.
ఇక, మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. పెండింగ్ క్లైమ్స్ మార్చి నెలాఖరులోగా చెల్లిస్తామని స్పష్టం చేశారు.. జీపీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ బిల్లులు, టీఏ, ఏపీ జీఎల్ఐఏ అంశాల్లో ఉన్న పెండింగ్ బిల్లులు చెల్లించేస్తున్నాం అని వెల్లడించారు.. పెండింగ్ బిల్లుల పైనే నాలుగు గంటల పాటు చర్చించామని.. ఉద్యోగ సంఘాలకు స్పష్టత ఇచ్చామని.. ఈ నెలాఖరులోగా సుమారు రూ. 3 వేల కోట్లు చెల్లింపులు జరుపుతామని వెల్లడించారు మంత్రి ఆదిమూలపు సురేష్.
మరోవైపు.. ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గతంలో మాదిరిగా ఛాయ్, బిస్కట్ సమావేశం కాదు.. పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు.
డీఏ బకాయిలను రెండు క్వార్టర్లల్లో క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు.. మొత్తంగా రూ. 16 వేల కోట్ల బిల్లులు పెండింగులో ఉంటే.. రూ. 3 వేల కోట్లు క్లియర్ చేస్తామన్నారని.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు.. కోవిడ్ వల్ల ఒకటో తేదీన జీతాలివ్వలేకపోతున్నామని ప్రభుత్వం చెప్పింది.. ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు కోవిడ్ ప్రభావం ఉంటుందని సెటైర్లు వేశారు.
0 Comments:
Post a Comment