First Hair Cut: మన భారతీయ సంస్కృతిలో సాంప్రదాయాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా ఇలాంటి ఎన్నో సాంప్రదాయాలను ప్రజలు ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు.
సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత 9 నెలలు, 11 నెలలు లేదా మూడు సంవత్సరాలకు కానీ పుట్టు వెంట్రుకలు తీస్తారు. మరి కొంతమంది పిల్లలు పుట్టిన ఐదు సంవత్సరాలు తర్వాత కూడా పుట్టు వెంట్రుకలు తీయడం సహజం.
అయితే ఇది ప్రాచీన కాలం నుండి వస్తున్న సాంప్రదాయం.. అయినప్పటికీ చిన్నపిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడంలో సైంటిఫిక్ రీసన్ కూడా ఉందని వైద్య నిపుణులు చెపుతున్నారు. నెలలపాటు పిల్లలు తల్లి గర్భంలో ఉన్న ఉమ్ము నీటిలోనే పెరుగుతారు.
Baby Frist Hair Cut On Astrology
దీంతో ఉమ్ము నీటిలో ఉన్న బ్యాక్టీరియా మరియు సూక్ష్మ క్రిములు పిల్లల శరీరంలో, తల భాగంలో కూడా ఉంటాయి. అంతేకాకుండా పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని నెలలకు చర్మం కూడా పొరలుగా ఊడిపోయి కొత్త చర్మం వస్తుంది.
దీంతో చర్మం మీద ఉన్న సూక్ష్మ క్రిములు తొలగిపోతాయి. అయితే తలభాగం లో మాత్రం అలా జరగదు. దీంతో చిన్నపిల్లలు తరచూ అనారోగ్యానికి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అందువల్ల పిల్లలు పుట్టిన తర్వాత తొమ్మిది నెలలకు లేదా 11 నెలలకు పుట్టు వెంట్రుకలు తీయించడం అనాదిగా వస్తుంది.
అయితే ఇది ఎందుకు ఒక సంవత్సరం ముగిసిన తర్వాతనే చేస్తారంటే బిడ్డ పుట్టిన కొన్ని నెలల వరకు తలభాగం చాలా మెత్తగా మరియు సున్నితంగా ఉంటుంది.
తలభాగం గట్టిపడటానికి సంవత్సరకాలం పడుతుంది. అందువల్ల దాదాపు పిల్లలందరికీ కూడా 11 నెలలు లేదా మూడు సంవత్సరాల లో పుట్టి వెంట్రుకలు తీయడం అనాదిగా వస్తుంది.
పిల్లలకు గుండు చేయించడం వల్ల నెత్తిపై సూర్య రష్మి పడడంతో పిల్లలు ఎదుగుదల వేగంగా ఉంటుంది.
దీని కారణంగానే పిల్లల ఆరోగ్యం కోసం పుట్టు వెంట్రుకలు అనేది తీయించడం ఆ కాలంనాటి ఆచారంగా వస్తుంది..
0 Comments:
Post a Comment