Electricity bill: ఈ సింపుల్ టిప్స్‌తో ఎండాకాలంలో మీ కరెంట్ బిల్లును సగానికి తగ్గించేయొచ్చు..
కరెంట్ ఛార్జీలు పెరిగాయి. ఈ క్రమంలో బిల్లు చూస్తేనే షాక్ కొడుతున్న పరిస్థితి. ప్రజంట్ సమ్మర్ సీజన్ నడుస్తుంది. ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు.
ఈ సమయంలో ఫ్యాన్, కూలర్ లేదా ఏసీ లేకపోతే చాలా అంటే చాలా కష్టం. ఇక ఫ్రిజ్ లేకపోతే ఎలా చెప్పండి. అయితే, వీటిని వాడుతూ కూడా కరెంటు బిల్లు తక్కువగా వచ్చేలా చూసుకోవడం సాధ్యమే అంటున్నారు నిపుణులు. వారు ఏం సూచనలు, సలహాలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఏసీ, ఫ్రిజ్, గీజర్, ఒవెన్, తదితర విద్యుత్ పరికరాలను మనం వాడే తీరుపై మెయిన్‌గా ఫోకస్ పెట్టాలంటున్నారు. యూనిట్లు పెరిగితే శ్లాబు రేటు మారుతుంది. శ్లాబ్ మారిందంటే కరెంటు బిల్లు మోత మోగిపోతుంది. అందుకే క్రమపద్ధతిలో విద్యుత్ వినియోగిస్తే అధిక బిల్లులను నివారించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
1. ఏసీ వాడేవారికి పొదుపు సూత్రం.
ముందుగా ఏసీ ఎలా వాడాలో చాలామంది తెలుసుకోవాలి. ఏసీ ఉష్ణోగ్రతను బాగా తగ్గిస్తే, ఇల్లు త్వరగా చల్లబడుతుందని భావిస్తుంటారు. కానీ ఏసీ ఉష్ణోగ్రతను ఇలా మరీ తగ్గించకూడదని నిపుణులు చెబుతున్నారు. ఏసీలను 24 నుంచి 26 డిగ్రీల మధ్యే ఉపయోగించితే.. లోడ్ భారం అదుపులో ఉంటుందని పేర్కొంటున్నారు. ఎప్పుడూ 24 నుంచి 26 మధ్య ఉంచితే రూ.300 వరకు బిల్లు తగ్గుతుంది. ఇక గదిలో చల్లదనాన్ని గ్రహించే వస్తువులు లేకుండా చూసుకోవాలి. దీని వల్ల గాలి బయటకు వెళ్లే ఛాన్స్ లేకుండా గది త్వరగా చల్లబడుతుంది. అలాగే సూర్యకిరణాలు గదిలోకి రాకుండా చూడాలి. ఎయిర్ కండీషనర్ ఆన్‌లో ఉన్నప్పుడు ఇంటి కిటికీలు మరియు తలుపులు మూసి ఉంచాలని గుర్తుంచుకోండి.లేదంటే ఏసీ నుంచి చల్లటి గాలి బయటకు వెళ్లి ఇల్లు చల్లగా ఉండదు
2. ఫ్రిజ్ విషయంలో టిప్స్.
మెయిన్‌గా ఇంట్లో వాడే ఫ్రిజ్ పాతదైతే నెలకు 160 యూనిట్లకు పైగానే కరెంటు కాలుతుంది. అదే స్మార్ట్ ఫ్రిజ్ అయితే అవసరమైనప్పుడే ఆన్ అవుతాయి.
లేకుంటే ఆగిపోతాయి. వీటివల్ల కరెంటు బిల్లు రూ.300 వరకు తగ్గే ఛాన్సుంది. ఇక ఫ్రిజ్ ఉంచే ప్రదేశానికి, గోడకు మధ్య వేడి తగ్గించేలా కొంత ప్లేస్ ఉండేలా చూసుకోవాలి. ఫ్రిజ్ డోర్‌ని ఎల్లప్పుడూ సరిగ్గా మూసి ఉంచాలి. అలాగే, వెదర్ కండిషన్ బట్టి శీతలీకరణ బటన్‌ను సెట్ చేయండి.
3. LED బల్బులను వాడండి.
ఇప్పటికీ చాలా మంది ఇళ్లలో పాత ఫిలమెంట్ బల్బులు, సీఎఫ్‌ఎల్‌లను యూజ్ చేస్తున్నారు. ఈ పాత పరికరాలు ఎక్కువ కరెంట్ ఉపయోగిస్తాయి. వీటికి బదులు ఇంట్లో ఎల్ఈడీ (LED) బల్బులను ఉపయోగించండి. ఇది మీ విద్యుత్ బిల్లును తగ్గిస్తుంది.
4. ఈ టిప్స్ పాటించండి
ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో ఒకటికి రెండు సార్లు లైట్లు, ఫ్లాన్లు, ఏసీలు, హీటర్లు, ఇతర ఎలక్ట్రిక్ పరికరాలన్నీ ఆఫ్ చేసి ఉన్నాయో? లేదో? చెక్ చేసుకోవాలి. పాత ఎలక్ట్రానిక్ పరికరాల స్థానంలో స్మార్ట్ పరికరాలను ఉపయోగించండి. అవి విద్యుత్ బిల్లును తగ్గిస్తాయి. తద్వారా దీర్ఘకాలంలో ప్రయోజనం పొందవచ్చు.
0 Comments:
Post a Comment