Curd With Flax Seeds Powder : పెరుగులో ఈ పొడి కలిపి తింటే చాలు.. హార్ట్ బ్లాక్‌లు పోతాయి.. కీళ్ల నొప్పులు తగ్గుతాయి..!
Curd With Flax Seeds Powder : నేటి తరుణంలో మనలో చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కీళ్ల నొప్పులు, అధిక బరువు, కీళ్లు అరిగిపోవడం, రక్తపోటు, షుగర్ వంటి వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఇటువంటి అనారోగ్య సమస్యలన్నింటిని మనం ఒక చిన్న చిట్కాను వాడి తగ్గించుకోవచ్చు. మనకు వచ్చే వివిధ రకాల అనారోగ్య సమస్యలను తగ్గించే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి…ఎలా వాడాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం కేవలం రెండు పదార్థాలనే ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ రెండు పదార్థాలు మరేవో కాదు పెరుగు మరియు అవిసె గింజలు. ముందుగా ఒక కప్పు అవిసె గింజలను కళాయిలో వేసి దోరగా వేయించాలి.
తరువాత వీటిని జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న అవిసె గింజల పొడిని రెండు టీ స్పూన్ల మోతాదులో అర కప్పు పెరుగులో కలిపి తీసుకోవాలి. షుగర్ లేని వారు ఇందులో పటిక బెల్లం పొడిని కూడా కలిపి తీసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పెరుగును ఊబకాయంతో బాధపడే వారు భోజనానికి 5 నిమిషాల ముందు తీసుకోవాలి. సన్నగా, బరువు పెరగాలనుకునే వారు దీనిని భోజనం చేసిన తరువాత తీసుకోవాలి. ఈ విధంగా పెరుగును, అవిసె గింజల పొడిని కలిపి తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, మంటలు తగ్గుతాయి. నరాల సమస్యలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Curd With Flax Seeds Powder
రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలాగే రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. పెరుగును అవిసె గింజలను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రక్తం కూడా శుద్ధి అవుతుంది. శరీరంలో పోషకాహార లోపం తలెత్తకుండా ఉంటుంది. కీళ్ల నొప్పులు, వాపులు వంటి సమస్యలతో బాధపడే వారు పెరుగును, అవిసె గింజలను కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా పెరుగు, అవిసె గింజలను కలిపి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. మలబద్దకం సమస్యతో బాధపడే వారు ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఈ విధంగా పెరుగు, అవిసె గింజల పొడిని కలిపి తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడంతో పాటు మన దరి చేరకుండా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
0 Comments:
Post a Comment