✍️'నిమిషం ఆలస్యమైనాటెన్త్ పరీక్షలకు అనుమతించం'
*🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో*
పదో తరగతి విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు 45 నిమిషాల ముందే చేరుకోవాలని, ఉదయం 9.30 గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని పాఠశాల విద్యాశాఖ కమిషనరు ఎస్ సురేష్కుమార్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు టెన్త్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు, ఎంఇఒలకు, ఇన్విజిలేటర్లకు సూచనలతో శుక్రవారం విడివిడిగా ఉత్తర్వులు విడుదల చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. అభ్యర్థులు 8.45కే హాల్టిక్కెట్లతో పరీక్ష కేంద్రాలకు చేరుకుని, కేటాయించిన సీట్లలో కూర్చోవాలని సూచించారు. హాల్టిక్కెట్లు పొందిన తరువాత పేరు, పుట్టినరోజు, ఫొటో వంటి వాటిలో పొరపాట్లుంటే ప్రధానోపాధ్యాయులు దృష్టికి తీసుకెళ్లాలన్నారు. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలనూ తీసుకెళ్లకూడదని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలను ఎంఇఒలు ముందుగానే తనిఖీ చేయాలన్నారు. ప్రశ్నాపత్రాలను సీరియల్ నెంబర్లతో ముద్రిస్తామని, ఈ ప్రకారమే విద్యార్థులకు అందిస్తామని పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment