Credit card vs debit card difference : క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌లను పేమెంట్స్ కోసం వినియోగిస్తారు అన్న విషయం తెలిసిందే.
ఈ రెండింటికీ 16 డిజిట్ నెంబర్స్, ఎక్స్పైరీ డేట్, సీవీవీ కోడ్స్, ఈఎంవీ చిప్స్ వంటివి ఉంటాయి. అయితే.. ఈ రెండింటి మధ్య అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు తెలుసుకుందాము.
డెబిట్ కార్డ్ అంటే ఏంటి..?
మీరు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే.. సంబంధిత బ్యాంక్ మీకు డెబిట్ కార్డ్ ఇస్తుంది. ఇది బ్యాంక్ అకౌంట్‌తో లింకై ఉంటుంది. ఫలితంగా.. అందులోని నిధులను డెబిట్ కార్డ్ ద్వారా ఉపయోగించుకోవచ్చు.
పేమెంట్ చేసినప్పుడు, నిధులు డైరక్ట్‌గా బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతాయి. బ్యాంక్‌కు సంబంధించిన ఏటీఎం నుంచి క్యాష్ డ్రా చేస్తే.. ఎలాంటి ట్రాన్సాక్షన్, విత్‌డ్రా ఫీజ్‌లు ఉండవు. అయితే.. వీటిల్లో డెయిలీ స్పెండింగ్, విత్‌డ్రా లిమిట్స్ ఉంటాయి.
క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి..?
Credit card vs debit card : 'బై నౌ పే లేటర్'(ఇప్పుడు కొను, తర్వాత కట్టు)కు చక్కటి ఉదాహరణ ఈ క్రెడిట్ కార్డ్. వీటిని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు ఇష్యూ చేస్తుంటాయి. మీ దగ్గర సమయానికి నగదు లేకపోతే.. క్రెడిట్ కార్డ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు.
కొంత కాలానికి డ్యూ డేట్ పడుతుంది. ఆలోపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ క్రెడిట్ లిమిట్స్ ఉంటాయి. ఇది ఒక్కో బ్యాంక్‌కు ఒక్కో విధంగా ఉంటుంది.
ఇదీ చదవండి : Types of savings account : సేవింగ్స్ అకౌంట్ ఎన్ని రకాలు? వాటి ఉపయోగాలేంటి?
క్రెడిట్ కార్డ్ వర్సెస్ డెబిట్ కార్డ్..
మీ క్రెడిట్ స్కోరు, బ్యాంక్‌తో మీకున్న సంబంధం వంటి అంశాలపై మీ నెలవారీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఆధారపడి ఉంటుంది. డెబిట్ కార్డ్‌కు అలా ఏమీ ఉండదు. మీ రోజువారీ ట్రాన్సాక్షన్స్ సులభంగా చేసుకోవచ్చు.
Credit card usage : డెబిట్ కార్డ్ నుంచి మీరు మీ డబ్బులను విత్‌డ్రా చేసుకుంటారు. కానీ క్రెడిట్ కార్డ్‌లో అలా కాదు. క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తుంటే.. మీరు అప్పు చేస్తున్నట్టే! ఫలితంగా మీపై వడ్డీ భారం పడుతుంది.
దీనితో పాటు ట్రాన్సాక్షన్ ఫీజ్ వంటివి కూడా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఇంట్రెస్ట్- ఫ్రీ క్రెడిట్ కూడా మీకు లభించవచ్చు.
కొన్ని క్రెడిట్ కార్డ్స్‌లో యాన్యువెల్ ఫీజ్ ఉంటుంది. ఇంకొన్నింట్లో ఉండదు. ఇక ఫీజ్ ఉన్న వాటిలో నిర్దేశించిన నగదు ఖర్చు చేస్తే ఫీజ్ పడదు. డెబిట్ కార్డ్‌కు రెనెవెల్ ఫీజ్, యాన్యువల్ ఫీజ్‌లు ఉండొచ్చు.
క్రెడిట్ కార్డ్స్‌లో అనేక ఉపయోగాలు ఉంటాయి. క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్స్ రివార్డ్స్ వంటివి లభిస్తుంటాయి. డెబిట్ కార్డ్స్‌లో ఇలాంటివి చాలా తక్కువ.
Debit card usage : డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వినియోగంలో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. దుకాణాలు, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్.. ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు.
డెబిట్ కార్డ్‌కి ఎలిజిబులిటీ వంటివి ఉండవు! బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ అయితే చాలు. కానీ క్రెడిట్ కార్డ్‌లకు ఎలిజిబులిటీ ఉంటుంది. మీ ఉద్యోగం, జీతం, సేవింగ్స్ వంటి అంశాల ఆధారంగా మీకు కార్డ్ వస్తుంది.
Credit card vs debit card which is better : క్రెడిట్ కార్డ్స్‌లో జీరో లయబులిటీ ఇన్ష్యూరెన్స్ ఉంటుంది. కార్డ్స్ ఎప్పుడైనా మిస్ అయితే ఇది ఉపయోగపడుతుంది. కానీ డెబిట్ కార్డ్‌లకు ఇది ఉండదు.
0 Comments:
Post a Comment