Cancer - ఒక్క మాత్రతో క్యాన్సర్ దూరం..
ట్రీట్‌మెంట్‌కు రెస్పాండ్ కాని టెర్మినల్ లుకేమియా పేషెంట్స్‌కు 'రెవుమెనిబ్' అనే పిల్ ఉపశమనం కలిగిస్తుందని, వారిలో క్యాన్సర్ తగ్గేందుకు దోహదపడుతుందని యునైటెడ్ స్టేట్స్‌లో నిర్వహించిన ఓ క్లినికల్ ట్రయల్ అధ్యయనకర్తలు చెప్తున్నారు.
ఇందులో పాల్గొన్న పేషెంట్లలో మూడవవంతు మందికి 'రెవుమెనిబ్' మాత్ర ఇవ్వగా, అది వారిలో క్యాన్సర్‌ను పూర్తిగా తొలగించిందని తెలిపారు.
భవిష్యత్తులో ప్రపంచం అంతటా లుకేమియాను మాత్రల ద్వారా తగ్గించే మార్గాన్ని ఈ క్లినికల్ ట్రయల్ సుగమం చేసిందని టెక్సాస్ యూనివర్సిటీలోని ఆండర్సన్ క్యాన్సర్ సెంటర్ ఎండి, లుకేమియా డాక్టర్ ఘయాస్ ఇస్సా అన్నారు. ఈ పిల్ వాడినవారిలో వారి ఎముక మజ్జ నుంచి లుకేమియా కణాలు అదృశ్యమయ్యాని తెలిపారు.
ఎలా పని చేస్తుంది?
అక్యూట్ మైలోయిడ్ లుకేమియా (AML) అనేది ఒక రకమైన క్యాన్సర్. ఇది ఎముక మజ్జపై దాడి చేస్తుంది. దీనివల్ల రక్త కణాలు బలహీనంగా ప్రొడ్యూస్ అవుతాయి. అయితే రెవుమెనిబ్ (Revumenib) పిల్ ఈ పరిస్థితిని నివారిస్తుంది. బాడీలో మెనిన్ అనే నిర్దిష్ట ప్రొటీన్‌ను నిరోధించే తీవ్రమైన లుకేమియాను అడ్డుకుంటుంది. లుకేమియా కణాలను తిరిగి సాధారణ కణాలలోకి రీప్రోగ్రామింగ్ చేయడంలో దోహదపడుతుంది.
0 Comments:
Post a Comment