'బైజూస్ కంటెంట్' ప్రాధాన్యత తెలీదా?
ట్యాబ్‌లు దుర్వినియోగమైతే టీచర్లదే బాధ్యత
హెచ్‌ఎం, ఉపాధ్యాయులపై డీఈఓ ఆగ్రహం
రాప్తాడురూరల్: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి తీసుకొచ్చిన బైజూస్ కంటెంట్‌కున్న ప్రాధాన్యత తెలియకపోతే ఎలా?
విద్యార్థులు ట్యాబ్‌లు వాడుతున్నది? లేనిది? మానిటరింగ్ చేయకపోతే ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోదా? అంటూ ఉపాధ్యాయులను డీఈఓ సాయిరాం నిలదీశారు. అనంతపురంలోని రాజేంద్ర నగరపాలక ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థుల నోట్, వర్క్ బుక్‌లను పరిశీలించారు. ఇద్దరు విద్యార్థుల బై జూస్ ట్యాబ్‌ల్లో కంటెంట్ లేకపోవడంతో హెచ్‌ఎం, టీచర్లపై అసహనం వ్యక్తం చేశారు. ట్యాబ్‌ల వినియోగంపై నిరంతర నిఘా ఉండాలని సూచించారు. టీచర్ల డైరీలు అప్డేట్ లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యహరించిన హెచ్‌ఎంకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. డీఈఓ వెంట డీసీఈబీ కార్యదర్శి లోకేశ్వరరెడ్డి, ఏపీఓ నారాయణస్వామి ఉన్నారు.
ట్యాబ్‌లు దుర్వినియోగమైతే టీచర్లదే బాధ్యత
బైజూస్ కంటెంట్ కలిగిన ట్యాబ్‌లు దుర్వినియోగమైతే సంబంధిత టీచర్లదే బాధ్యత అని డీఈఓ ఎం.సాయిరాం హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 21,632 మంది 8వ తరగతి విద్యార్థులు, 3,991 మంది 8వ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్ కలిగిన ట్యాబ్‌లను అందజేసినట్లు గుర్తుచేశారు. ఈ ట్యాబ్‌లు దుర్వినియోగమైతే సంబంధిత ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి
వ్యక్తిగత పరిశుభ్రతతో మెరుగైన ఆరోగ్యం సిద్ధిస్తుందని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వీరబ్బాయి, డీఈఓ సాయిరాం, జెడ్పీ సీఈఓ భాస్కరరెడ్డి సూచించారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అనంతపురంలోని కేఎస్‌ఆర్ బాలికల పాఠశాలలో జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసి, వారు మాట్లాడారు. ప్రతి ఆరు నెలలకోసారి ప్రభుత్వం నిర్వహిస్తున్న నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చేతులను శుభ్రం చేసుకునే విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గంగాధర్‌రెడ్డి, వనజాక్షి, హెచ్‌ఎం కిరణ్మయి, డాక్టర్ నారాయణ స్వామి, మేనేజర్ రజిత, డీసీఈబీ కార్యదర్శి లోకేశ్వర్ రెడ్డి, డాక్టర్ తేజస్విని, వెంకట రమణ నాయక్, ఎంఈఓ వెంకట స్వామి , డిప్యూటీ డెమో త్యాగరాజు, వేణు, కిరణ్ పాల్గొన్నారు.
టీవీలు పెట్టొదు.. సెల్‌ఫోన్లు ఇవ్వొద్దు
రాప్తాడు: 'ఏమ్మా...మీ .అమ్మాయి ఈ ఏడాది పదో తరగతి కదా.. స్కూలు వదిలిన తర్వాత ఇంటి వద్ద ఎలా చదువుతోంది. చదివేటప్పుడు టీవీ పెట్టకండి. సెల్‌ఫోన్ కూడా చేతికివ్వకండి' అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు డీఈఓ సాయిరాం సూచించారు. నైట్ విజన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి రాప్తాడు మండలం హంపాపురం గ్రామంలో ఆయన పర్యటించి, పదో తరగతి విద్యార్థులను సందర్శించారు. ఇంటి వద్ద విద్యార్థులు ఎలా చదువుతున్నారంటూ తల్లిదండ్రులను ఆరా తీశారు. విద్యార్థుల వర్కు బుక్కు, నోట్ పుస్తకాలను పరిశీలించారు. పరీక్షలు దగ్గర పడుతున్నాయని సమయాన్ని వృధా చేయకుండా బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఒత్తిడికి లోనూకాకుండా కృషి పట్టుదలతో చదివితే విజయం మీ సొంతమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం బాలమురళి కృష్ణ, ఏపీఓ నారాయణ స్వామి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. .
విద్యార్థులను మానిటరింగ్ చేయకపోతే ఎలా?
హెచ్‌ఎం, ఉపాధ్యాయులపై డీఈఓ సాయిరాం ఆగ్రహం
0 Comments:
Post a Comment