New Party In Telangana | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారింది. ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అయిన కేసీఆర్ దేశ రాజకీయాల్లో అడుగుపెట్టారు.
అయితే కేసీఆర్ వదిలేసిన టీఆర్ఎస్ పేరుతో రాష్ట్రంలో మరో కొత్త పార్టీ అవతరించనుందని వార్తలు వస్తున్నాయి.
TRS అనే పేరును అస్త్రంగా మార్చుకొని..తెలంగాణ సెంటిమెంట్ ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని కొంతమంది చూస్తున్నారట.
తెలంగాణ రాజ్య సమితి లేదా తెలంగాణ రైతు సమాఖ్య పేరుతో రిజిస్ట్రేషన్ కు ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం.
అయితే దీని వెనుక ఎవరున్నారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ ఇదే జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటు చేసుకోనుంది.
కాగా తెలంగాణలో ఇప్పటికే చాలా పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఇంకో పార్టీ వస్తే ఏముందులే అనుకుంటే పొరపాటే.
తెలంగాణ ప్రజల నోళ్లలో టీఆర్ఎస్ పేరు నేటికీ నానుతుంది. ఈ క్రమంలో ఆ పేరుతో పార్టీ పెడితే బీఆర్ఎస్ కు నష్టం తప్పదు.
టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ కు తీవ్ర పోటీ తప్పదు. ఈ కొత్త పార్టీని మాజీ ప్రతినిధులు, అసంతృప్తి నాయకులూ, ఉద్యమ సమయం నుండి పార్టీలో ఉంటూ రాజకీయంగా అవకాశాలు రాని వారంతా ఒక్కటై పార్టీ పెట్టాలని భావిస్తున్నారట.
ఇందులో ముఖ్యంగా 4 జిల్లాలకు చెందిన నేతలు ఉన్నట్టు సమాచారం. తమకున్న ప్రజాబలం, టీఆర్ఎస్ పేరుతో ఎన్నికల్లో కీలకం కావాలని వీళ్లు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు ఆ పేరుతో పార్టీ పెట్టడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు.
కాంగ్రెస్ లో జోష్ పెరిగిందా?
ఒకవేళ టీఆర్ఎస్ పేరుతో పార్టీ రిజిస్టర్ చేయిస్తే బీఆర్ఎస్ కు నష్టం వాటిల్లే అవకాశాలు లేకపోలేదు.
కారు గుర్తును కేటాయించనప్పటికీ కూడా టీఆర్ఎస్ పేరును కేటాయిస్తే మాత్రం రాజకీయంగా బీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవు.
తెలంగాణ రాజ్య సమితి లేదా తెలంగాణ రైతు సమాఖ్య, తెలంగాణ రక్షణ సమితి, తెలంగాణ రైతు సమితి పేర్లలో ఏదైనా ఒక పేరు వచ్చేలా పెట్టాలని చూస్తున్నారట. ,
మొత్తానికి ఇంగ్లిష్ లో TRS వచ్చే విధంగా పార్టీని తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ టీఆర్ఎస్ పేరుతో పార్టీ ఏర్పాటు జరిగితే అది రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనంగా మారనుంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పేరు ఫలితాలను తారుమారు చేసే అవకాశం లేకపోలేదు.
0 Comments:
Post a Comment