మనల్ని మనం యథాతథంగా ఆమోదించాలి. మన వయసు ఎంతైనా కావచ్చు. మన రంగు ఎలా అయినా ఉండవచ్చు. ఎత్తు తక్కువైతేనేం, లావు ఎక్కువైతేనేం?' అని పిలుపునిస్తున్నారు రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ.
ఇందుకోసం తన నేతృత్వంలోని 'హర్ సర్కిల్' ఎన్జీవో ఛత్రం కింద 'ఎవ్రీ బాడీ ప్రాజెక్ట్' ప్రారంభించారు.
'మనల్ని మనం యథాతథంగా ఆమోదించాలి. మన వయసు ఎంతైనా కావచ్చు. మన రంగు ఎలా అయినా ఉండవచ్చు. ఎత్తు తక్కువైతేనేం, లావు ఎక్కువైతేనేం?' అని పిలుపునిస్తున్నారు రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ. ఇందుకోసం తన నేతృత్వంలోని 'హర్ సర్కిల్’ ఎన్జీవో ఛత్రం కింద 'ఎవ్రీ బాడీ ప్రాజెక్ట్’ ప్రారంభించారు.
ఉధృత ప్రచారమూ చేపట్టారు. శారీరక పరిమితుల్ని అధిగమించి విజయ తీరాలకు చేరుకున్న మహిళల గాథలను ప్రచారంలోకి తెస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్‌తోనూ ప్రజల్లోకి వెళ్తున్నారు. సోషల్ మీడియా మహిళను అర్థంలేని అంచనాల వైపు ఉసిగొల్పుతున్నది.
అందానికి వింత ప్రమాణాలు నిర్దేశిస్తున్నది. విజయానికి ఒంటి కొలతలు ముఖ్యమని దుష్ప్రచారం చేస్తున్నది. వీటన్నిటినీ ఖండించేందుకు ఈ వేదిక పనిచేస్తుందని నీతా ప్రకటించారు. 'నిన్ను నువ్వు ఆమోదించడమే నీ విజయానికి తొలిమెట్టు' అంటారామె.
ఇప్పటికే 'హర్ సర్కిల్’ గ్రూప్ దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా రికార్డు సృష్టించింది. నిజమే, సమాజాన్ని పట్టిపీడిస్తున్న తీవ్ర సమస్య ఇది. ఇంకెవరితోనో పోల్చుకుని ఆత్మన్యూనతకు గురవుతున్నవారు, ఆ డిప్రెషన్‌లో ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నవారు ఎంతోమంది.
0 Comments:
Post a Comment