నేడు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యటన
విశాఖ విద్య: విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. విద్యా కార్యకలాపాల అమలు ఎలా ఉందనేది తెలుసుకునేందుకు నగరంలోని కొన్ని పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసే అవకాశం ఉండటంతో జిల్లా విద్యాశాఖాధికారులు అప్రమత్తమయ్యారు.
ముందస్తు సమాచారం లేకుండా, నేరుగా పాఠశాలల సందర్శనకు వెళ్తున్నందున జిల్లాలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులంతా సిద్ధంగా ఉండాలని డీఈవో చంద్రకళ ఆదేశించారు. విద్యాశాఖ అధికారులతో కలసి ఆమె మంగళవారం నగరంలోని పలు పాఠశాలలను సందర్శించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు.
0 Comments:
Post a Comment