మన చుట్టూ ఉన్న చాలా మంది ఒంటరిగా ఫీలవుతుంటారు. మానసిక సమస్యలు, ఆత్మహత్య ధోరణులు, మాదకద్రవ్యాల వ్యసనం, వ్యాధులు, మరెన్నో కారకాలు ఒంటరితనానికి దారితీస్తుంది.
సామాజికంగా ఒంటరిగా ఉండటం లేదా ఒంటరిగా అనిపించడం ఎన్నో వ్యాధులకు దారితీస్తుంది. ఎందుకంటే మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
ఒంటరితనంతో ముడిపడి ఉన్న అన్ని కారణాల వల్ల అకాల మరణానికి దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మీరు ఒంటరిగా ఉంటే అది గుండె జబ్బులు, నిరాశ, ఆందోళన, డయాబెటిస్,అధిక రక్తపోటుకు వంటి రోగాలు వస్తాయి.
ఒంటరితనం అనేక వ్యాధులకు కారణం, లక్షణం కావొచ్చంటున్నారు నిపుణులు. ఆర్థిక సమస్యలు, ఇష్టమైన వారి మరణం, వైఫల్యం, మీరు దేనికీ పనికిరారనే భావన ఒంటరితనానికి కొన్ని సాధారణ కారణాలు. అసలు ఒంటరితనం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
డైస్తీమియా
డిస్థైమియా ను పెర్సిస్టెంట్ డిప్రెసివ్ డిజార్డర్ (పీడీడీ) అని కూడా అంటారు. ఇది మానసిక, ప్రవర్తనా రుగ్మత. ఒంటరితనం వల్ల వచ్చే ప్రధాన వ్యాధుల్లో ఇదీ ఒకటి. ఇది శారీరక అనారోగ్యం కానప్పటికీ.. దీనితో బాధపడుతున్న వ్యక్తి ఎప్పుడూ ఒంటరిగా ఉండాలని కోరుకుంటాడు. డైస్తీమియా అనేది దీర్ఘకాలిక మానసిక ఆరోగ్య సమస్య. ఇది క్రమంగా ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవం తగ్గడానికి దారితీస్తుంది.
ఆందోళన
ఆందోళన సమస్యలు ఉన్నవారికి వ్యక్తులతో సంభాషించడంలో సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది భయం, స్వీయ-అవగాహన, అవమానాన్ని కలిగిస్తుంది.
రక్తపోటు
అధిక రక్తపోటు, గుండెపోటు, ఊబకాయం వంటి సంబంధిత శారీరక సమస్యలు సాధారణంగా.. సామాజికంగా ఒంటరిగా ఉన్నవారిలోనే ఎక్కువగా కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు. వీరిలో గుండెజబ్బులు వచ్చే ప్రమాదం 29 శాతం ఎక్కువగా ఉంది. స్ట్రోక్ ప్రమాదం 32% ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది.
క్యాన్సర్
ఒంటరితనం ఒత్తిడి వల్ల హార్మోన్లలో ఎన్నో మార్పులు వస్తాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. అలాగే క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలు కనుగొన్నాయి.
డయాబెటిస్ మెల్లిటస్
బరువు ఎక్కువగా ఉన్నవారికి ఇతరులతో పోల్చితే టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఒత్తిడి, ఒంటరితనం డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి.
హృదయ సంబంధ వ్యాధులు
ఒంటరితనం, సామాజిక ఒంటరితనాన్ని అనుభవించే వృద్ధ మహిళలకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనాలు కనుగొన్నాయి.
సామాజిక ఒంటరితనం, ఒంటరిగా ఉండే రుతుక్రమం ఆగిపోయిన మహిళలకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 27 శాతం పెరిగినట్టు ఇటీవలి అధ్యయనం కనుగొంది. ఈ అధ్యయన ఫలితాలు జామా నెట్వర్క్ ఓపెన్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.
0 Comments:
Post a Comment