జపాన్‌లోని పాఠశాల విద్యార్థినుల స్కర్టు ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది. ఇక్కడి విద్యావ్యవస్థ కూడా భిన్నంగా ఉంటుంది.
జపాన్ స్కూల్స్‌లో చదువుకునే బాలికలు సాధారణం కంటే పొట్టిగా ఉండే స్కర్టులు ధరించి కనిపిస్తారు.
దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి, బాలికల యూనిఫాంలోని స్కర్ట్ పొడవు వారు చదువుతున్న తరగతి ఆధారంగా నిర్ణయిస్తారని కొందరు చెబుతుంటారు.
అంటే క్లాస్ పెరిగే కొద్దీ వారి స్కర్ట్ పొడవు తగ్గుతుందట. కాగా స్కర్ట్ పొడవు విషయంలో ఇలాంటి రూల్ లేదని కూడా మరికొందరు అంటుంటారు.
జపాన్ అమ్మాయిలు పాఠశాలలో పొట్టి స్కర్టులు ధరించడానికి ఇష్టపడతారట. కాగా ప్రముఖ జపనీస్ పాప్ స్టార్ నమీ అమురో కారణంగా జపాన్‌లో పొట్టి స్కర్టులు ధరించే సంస్కృతి 1990లలో ఉద్భవించింది.
అమ్మాయిలు ఆమెను ఫాలో చేస్తుంటారు. కాగా కొన్ని పాఠశాలల్లో మోకాళ్ల వరకు ఉండే స్కర్ట్‌లను ధరించాలని చెబుతుంటారు.
అయితే విద్యార్థినులను తమ స్కర్ట్ పొడవును వారి ఇష్టానుసారం తగ్గిస్తుంటారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తరగతి ప్రకారం స్కర్టు పొడవు తగ్గించే నియమం అనేది ఏదీ లేదని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు చెబుతుంటాయి.
0 Comments:
Post a Comment