దిశ, వెబ్ డెస్క్: ఎప్పుడైనా అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఆ సమయంలో అక్కడే ఉన్నవారు ఆ మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ, అవి అరవు.
కానీ, ఫైర్ సిబ్బంది ఆపితే ఆ మంటలు ఆరుతాయి. ఈ విషయంలో చాలామందికి డౌట్ ఉంటుంది. విషయమేమంటే... మంట స్వభావాన్ని బట్టి ఆర్పేందుకు రకరకాల పదార్థాలు వాడుతారు.
అయితే అన్ని మంటలు నీటితోనే ఆర్పరు. మంటకు ఆక్సిజన్ అందకుండా చేయాలి. లేకపోతే అవి ఇంకా ఎక్కువసేపు చెలరేగే అవకాశముంటది.
కాలుతున్న వస్తువు వేడి తగ్గించడం, మండేందుకు అవసరమైన ఇంధనం దొరకకుండా చేయడం ముఖ్యమైన నివారణ చర్యలు.
గడ్డివాములు, పూరిల్లు లాంటివి తగులబడినప్పుడు నీటిని వేగంగా చల్లి ఆర్పుతారు. అంతేకాకుండా కార్బన్ డయాక్సైడ్(C02) సిలిండర్స్, ఫోమ్ డ్రై కెమికల్ పౌడర్(డి.సి.పి) లాంటి వాటిని వాడుతారు.
అయితే, మంటలు తీవ్రంగా ఉన్నప్పుడు మంటకు ఆక్సిజన్ అందకుండా చేసేందుకు కార్బన్ డయాక్సైడ్ సిలిండర్స్ వాడతారు. నూనె మంటల్ని నీటితో ఆర్పరు.
ఎందుకంటే వాటిపై నీరు చల్లితే బరువు వల్ల నీరు అడుగుకు చేరి నూనె పైకి తేలి మంట ఆరదు. అందుకే వాటిని నీటితో ఆర్పరు.
అయితే, వాటిని ఆర్పేందుకు నూనెపైన పరుచుకుని ఆక్సిజన్ అందకుండా చేసే ఫోమ్(నురగ)ను వినియోగిస్తారు. అదేవిధంగా విద్యుత్ లోహపు మంటలను ఆర్పేందుకు డి.సి.పి(డ్రై కెమికల్ పౌడర్) ని వాడుతారు.
0 Comments:
Post a Comment