ఒంటిపూట బడులు ఇంకెప్పుడు జగన్ రెడ్డి?: టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డి
తన అసమర్థ పాలనతో విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యార్థుల సంక్షేమం, బాగోగులనూ గాలికొదిలేయడం దుర్మార్గం అని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు.
మార్చి నెల ముగుస్తున్నా ఒంటిపూట బడులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడం ఒక్క రాజారెడ్డి రాజ్యాంగంలోనే సాధ్యమవుతోంది అని విమర్శించారు. ఎండలు మండిపోతుంటే హాఫ్ డే స్కూల్స్ పెట్టడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేంటో అర్ధం కావడంలేదన్నారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం మార్చి మొదటి లేదా రెండో వారంలో ఒంటిపూట బడులు పెట్టడం దశాబ్ధాలుగా అమలవుతోందని అలాకాకుండా అందుకు విరుద్ధంగా వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయులపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఒంటిపూట బడులు పెట్టడంలేదని ఆరోపించారు.
పైగా దీనిపై ప్రశ్నించిన ఉపాధ్యాయులపై విద్యామంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేయడం సిగ్గుచేటన్నారు. ఒంటిపూట బడులు పిల్లలకా? మీకా అంటూ మంత్రి చులకనగా మాట్లాడటం నీతిమాలినచర్య అన్నారు. ఏసీ రూముల్లో, ఏసీ కార్లలో
0 Comments:
Post a Comment