విజయ్ మాల్యా 9 వేల కోట్లు, నీరవ్ మోడీ 14 వేల కోట్లు, లలిత్ మోడీ 1700 కోట్లు.. ఇలా చాలా మంది స్కాములు చేసి విదేశాలకు పారిపోయారు. అయితే స్కాములు చేసిన వారు ఎక్కువగా యూకే వెళ్లి దాక్కుంటారు.
విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వాళ్ళు యూకేలో తలదాచుకుంటున్నారు. విజయ్ మాల్యాను ఇండియా రప్పించడానికి భారత ప్రభుత్వం ఇంకా ప్రయత్నాలు చేస్తుంది.
మామూలుగా చిన్న స్కామ్ చేస్తేనో, చిన్న దొంగతనం చేస్తేనో దొరికేవరకూ వదిలిపెట్టని పోలీసులు.. అంత పెద్ద స్కామ్ చేసిన వాళ్ళని పట్టుకోవడానికి ఎందుకు ఇంత ప్రయాస పడుతోంది? యూకే చట్టాలు నిజంగా అంత కఠినంగా ఉంటాయా? స్కాములు చేసిన వారికి అంత ఫేవర్ గా ఉంటాయా? అసలు ఈ స్కాములు చేసే వాళ్ళు ఎందుకు యూకే పారిపోతారు? వారు దాక్కోవడానికి యూకేనే ఎందుకు ఎంచుకుంటున్నారు? ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా? అంటే ఉన్నాయనే చెప్పాలి.
ఈ మాయగాళ్లు యూకే వెళ్ళడానికి ప్రత్యేక కారణం ఉంది. యూకేలో 2 మిలియన్ పౌండ్లు అంటే మన కరెన్సీలో 20 కోట్లు పెట్టుబడి పెట్టిన వ్యక్తులకు అక్కడి ప్రభుత్వం గోల్డెన్ వీసా ఆఫర్ చేస్తుంది.
దీన్ని ఇన్వెస్టర్ వీసా అని కూడా అంటారు. ఈ వీసా వచ్చిన వారికి ఐదేళ్ళలో యూకే సిటిజన్ షిప్ కూడా వస్తుంది. ఇంకేముంది ఇక్కడ కోట్లు మింగేసిన మాయగాళ్లు 20 కోట్లు కట్టి.. ఐదేళ్లు ఆగితే అక్కడ ఆ దేశ పౌరుల కింద పౌరసత్వాన్ని పొందుతారు.
ఈ మాయదారి మల్లిగాళ్లను ఇండియా పంపించమని యూకే ప్రభుత్వాన్ని మన ప్రభుత్వం రిక్వస్ట్ చేసిందనుకోండి.. అక్కడి ప్రభుత్వం కొన్ని కండిషన్స్ పెడుతుంది. ఇక్కడిలానే అక్కడ కూడా మానవ హక్కుల కమిషన్లు, మిషన్లు ఉంటాయి.
యూరోపియన్ కన్వెన్షన్ ఆన్ హ్యూమన్ రైట్స్ అని ఒకటుంది. యూరప్ లో ఉన్న వ్యక్తుల మానవ హక్కులను, రాజకీయ స్వేచ్ఛను కాపాడేందుకు పెట్టుకున్న అంతర్జాతీయ సంప్రదాయం.
ఒకవేళ ఇక్కడ స్కామ్ చేసి యూకేలో దాక్కున్న విజయ్ మాల్యాను అప్పగించమంటే.. ఇక్కడ వారిని ఎలాంటి చిత్రహింసలకు గురి చేయము అని గానీ, మరణ శిక్ష విధించడం గానీ చేయము అని చెప్పి అక్కడి కోర్టులో నిరూపించాల్సి ఉంటుంది.
దీన్ని ప్రూవ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక మెలిక పెట్టి రిజెక్ట్ చేస్తారు. విజయ్ మాల్యా లాంటి వాళ్ళు కూడా డబ్బులు చెల్లించి ఇండియాకి పంపించవద్దు, ప్రాణ హాని ఉందని ప్రేరేపిస్తారు. దీంతో యూకే ప్రభుత్వం విజయ్ మాల్యా లాంటి స్కామర్లను ఇండియా పంపించదు.
మన వాళ్ళే కాదు, ప్రపంచంలోని ఇతర దేశాల వాళ్ళు కూడా స్కాములు చేసి యూకేలో దాక్కుంటున్నారు. పైగా ఇలాంటి స్కాములోళ్ళ వల్ల ఆ దేశ ఆర్థిక పరిస్థితి బాగుంటుందని ఒక ఫీలింగ్.
మొత్తానికి యూకే దొంగలకు అడ్డాగా ఉందని, వారికి వత్తాసు పలుకుతుందన్న అపకీర్తి మూటగట్టుకుంది. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
0 Comments:
Post a Comment