Bitter Gourd For Skin : ఫంగల్ ఇన్ఫెక్షన్ ల కారణంగా మనం దురద, దద్దుర్లు వంటి వివిధ రకాల చర్మ సమస్యల బారిన పడుతూ ఉంటాం. దురద, దద్దుర్ల కారణంగా మనం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం.
దురదల కారణంగా చర్మంపై పుండ్లు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ చర్మ సమస్యలను మనం ప్రారంభ దశలో ఉన్నప్పుడే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం లేదంటే ఈ చర్మ సమస్యలు శరీరమంతా వ్యాపించడంతో పాటు దీర్ఘకాలం మనల్ని వేధిస్తూనే ఉంటాయి.
మనల్ని ఎంతో వేధించే ఈ చర్మ సమస్యలను మనం ఒక చిన్న చిట్కాను ఉపయోగించి నయం చేసుకోవచ్చు.
దురదలు, దద్దుర్లలతో పాటు ఇతర చర్మ సమస్యలను తగ్గించే చిట్కా ఏమిటి…చిట్కా తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అలాగే ఈ చిట్కాను ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం ముఖ్యంగా కాకరకాయను ఉపయోగించాల్సి ఉంటుంది. కాకరకాయలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
దీనిలో ఉండే చేదు గుణం చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ముందుగా కాకరకాయను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
ఈ కాకరకాయ పేస్ట్ ను గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పావు టీ స్పూన్ పసుపును వేసి కలపాలి. తరువాత ఇందులో అర టీ స్పూన్ కొబ్బరి నూనెను వేసి కలపాలి.
Bitter Gourd For Skin
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చర్మంపై దురద, దద్దుర్లు వంటి సమస్యలు ఉన్న చోట రాయాలి. దీనిని రాసే ముందు చర్మాన్ని చక్కగా శుభ్రం చేసుకోవాలి.
రాత్రి పడుకునే ముందు సమస్య ఉన్న ప్రాంతంలో చర్మాన్ని గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుని ఆ తరువాత కాకరకాయ మిశ్రమాన్ని రాసుకోవాలి.
ఉదయాన్నే మరలా గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా ఈ చిట్కాను పాటించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా అన్ని రకాల చర్మ సమస్యలను మనం తగ్గించుకోవచ్చు.
ఈ చిట్కాను వాడడం వల్ల చర్మంపై ఉండే ఇన్ఫెక్షన్ తగ్గి తిరిగి చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుంది.
0 Comments:
Post a Comment