ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా, సైన్స్(science) ఎంత అభివృద్ధి చెందినా, ఇప్పటికీ మన ఊహకు అందనివి, ఆశ్చర్యపరిచేవి ఎన్నో ఉంటాయి. కడలి తనలో ఎన్నో రహస్యాలను దాచుకుంటుంది.
సముద్రం(Sea)లో బతికే జీవులు గురించి ఎవరికీ సరిగా తెలియదు. సముద్ర గర్భంలో ఊహకు అందని వింతలు ఉంటాయి.
సముద్ర ఉపరితలంపై జీవిస్తున్న భారీ జీవుల వీడియోలు(Videos), ఫొటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా(Social Media)లో ప్రజలను ఆశ్చర్య పరుస్తూనే ఉంటాయి. ఇక సముద్రంలో ఉండే నీలి తిమింగలాల(blue whale) గురించి అందరికీ తెలిసిందే. భూమిపై అతిపెద్ద జీవులలో ఒకటి.
అయితే దాని లోపలి భాగాల గురించి తెలిస్తే.. మాత్రం మీరు అవునా అంటారు. సముద్రంలో ఉండే.. పెద్ద జీవుల్లో ఒకటైన తిమింగలం గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూస్తారు.
అయితే దాని గుండె(Heart) గురించి విషయాలు తెలిస్తే మాత్రం మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. వ్యాపారవేత్త Harsh Goenka ఓ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షర్ చేశారు. పూర్తిగా పెరిగిన నీలి తిమింగలం హార్ట్ ఎంత పెద్దదో ఇది చూపిస్తుంది.
నీలి తిమింగలాలు(blue whale) భూమిపై అతిపెద్ద జీవులలో ఒకటి. గోయెంకా నీలి తిమింగలం గుండె ఫోటోను షేర్ చేశారు. దీని బరువు 181 కిలోలు. దీని వెడల్పు 1.2 మీటర్లు, ఎత్తు 1.5 మీటర్లు. దాని గుండె చప్పుడు 3.2 కి.మీ కంటే ఎక్కువగా వినిపిస్తుందని రాసి ఉంది.
ఇది 2014లో న్యూఫౌండ్‌ల్యాండ్‌లో కొట్టుకుపోయిన నీలి తిమింగలం గుండెకు సంబంధించిన చిత్రం. ఇది పరిశోధన కోసం ఉంది.
కెనడాలోని టొరంటోలోని రాయల్ అంటారియో మ్యూజియంలో శాస్త్రవేత్తలు భద్రపరిచారు. ప్రపంచంలోని అతిపెద్ద హృదయ చిత్రాలను గొయెంకా పంచుకున్నారు.
గోయెంకా ఈ చిత్రాన్ని మార్చి 13న పోస్ట్ చేయగా దానిమీద చాలా మంది స్పందిస్తున్నారు. పోస్ట్ చూసిన వారు ఆశ్చర్యకరమైన కామెంట్లు చేస్తున్నారు.
మరియు ఇంత పెద్ద హృదయాన్ని సంపూర్ణంగా భద్రపరచడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'అద్భుతం కానీ ఇది నిజం. ప్రకృతి ఉత్తమమైనది.' అని అని ఓ ట్విట్టర్ వినియోగదారుడు రాశారు.
0 Comments:
Post a Comment