Beuty Tips | కురుల నిగారింపు కోసం షాంపూలు, ఆయిల్‌లు.. చర్మ సౌందర్యానికి సబ్బులు, లోషన్‌లు, మాయిశ్చరైజర్‌లు.. పెదాలకు లిప్ కేర్‌లు.. కాళ్లు చేతులకు మెహందీలు..
గోర్లకు నెయిల్ పాలిష్‌లు.. కనులకు, కనుబొమ్మలకు ఐ లైనర్‌లు.. అంటూ మహిళలు నిత్యం అందం కోసం ఆరాటపడుతుంటారు.
ఈ భూమ్మీదచాలా మందికి అందంగా కనపడాలనే ఆశ ఉంటుంది. పురుషుల కంటే మగువల్లో ఈ అందంగా కనిపించాలనే తపన ఎక్కువగా ఉంటుంది.
కురుల నిగారింపు కోసం షాంపూలు, ఆయిల్‌లు.. చర్మ సౌందర్యానికి సబ్బులు, లోషన్‌లు, మాయిశ్చరైజర్‌లు.. పెదాలకు లిప్ కేర్‌లు.. కాళ్లు చేతులకు మెహందీలు.. గోర్లకు నెయిల్ పాలిష్‌లు.. కనులకు, కనుబొమ్మలకు ఐ లైనర్‌లు.. అంటూ మహిళలు నిత్యం అందం కోసం ఆరాటపడుతుంటారు. అలాంటి వారి కోసం బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ కూడా కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. మరి ఆ చిట్కాలేంటో మనం కూడా తెలుసుకుందామా..?
బ్యూటీ టిప్స్ (Beauty Tips)
నిగనిగలాడే చర్మం కోసం..
1. చర్మం చిట్లిపోయి బిరుసెక్కినట్టుగా, అసౌకర్యంగా అనిపిస్తే ఒంటికి పెరుగు రాసుకుని, అరగంట తర్వాత స్నానం చేయాలి. దాంతో చర్మం మెత్తబడి నాజూగ్గా మారుతుంది.
2. కొందరికి యుక్త వయసులో కూడా చర్మం మీద ముడతలు వచ్చి ఇబ్బంది పెడుతాయి. ఇలాంటి ముడుతలు పోవాలంటే కొన్ని రోజులపాటు ప్రతిరోజూ ఉదయాన్నే చేమంతి పూలతో సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఫలితం కనిపిస్తుంది.
కేశాల నిగారింపు కోసం..
1. జుట్టు నిగారింపుతో మెరవాలంటే కోడిగుడ్డు సొన, అరటి పండు గుజ్జు బాగా కలిపి ఆ పేస్టును తలకు పట్టించి పావుగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.
2. జుట్టు బిరుసుగా ఉండి దువ్వుకోవడానికి వీలులేకుండా అయితే కొంచం నిమ్మరసం తలకు రాసుకోవాలి. ఆ తర్వాత దువ్వితే జట్టు ఎటంటే అటు మెత్తగా వంగుతుంది.
3. ఎరుపు రంగులో ఉన్న జుట్టు నల్లగా మారాలన్నా, తల వెంట్రుకలు రాలడం తగ్గాలన్నా ఒక వంతు యాపిల్ జ్యూస్, మూడు వంతుల నీళ్లు కలిపి తలకు రాసుకోవాలి. ఆ తర్వాత తల స్నానం చేయాలి.
అందమైన పెదాల కోసం..
1. పెదవులు తరచూ ఎండిపోతున్నా, పగుళ్లు ఏర్పడుతున్నా పాలమీగడను, కుంకుమ పువ్వును బాగా కలిపి రాత్రిపూట పడుకునేటప్పుడు పెదవులకు రాసుకోవాలి. ఈ విధంగా వారం, పదిరోజులు చేస్తే మీ పెదవులు గులాబీ రంగులోకి మారి అందంగా ఉంటాయి.
2. తేనెను, నిమ్మరసాన్ని గ్లిసరిన్‌లో కలిపి రాత్రిపూట పడుకోబోయే ముందు పెదాలకి రాసుకుని మర్దన చేస్తే పెదాల నల్లదనం పోతుంది. గులాబీ రంగులోకి మారి అందంగా కనిపిస్తాయి.
3. పెదవులపైన మచ్చలు పోవాలంటే గ్లిసరిన్‌లో కొంచెం రోజ్ వాటర్ కలిపి దానిని పెదాలకు మర్దన చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
0 Comments:
Post a Comment