❇️తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వడగళ్ల వర్షాలు వాతావరణశాఖ
అమరావతి : రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే అకాల వానలు కురియడంతో పంటలన్నీ నీటమునిగి తీవ్రంగా నష్టపోయిన రెండు రాష్ట్రాల అన్నదాతలు... మళ్లీ వాతావరణశాఖ హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ,దక్షిణ ఛత్తీస్‌గఢ్,ఒడిశా మీదుగా రాయలసీమ నుంచి దక్షిణ ఝార్ఖండ్ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వాతావరణశాఖ వివరించింది.
ఎపి వ్యాప్తంగా తేలికపాటి మోస్తరు వర్షాలు...
రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు లేదా ఈదురుగాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.కృష్ణా, కాకినాడ,ప్రకాశం, నెల్లూరు,పల్నాడు, ఏలూరు,చిత్తూరు, తదితర జిల్లాల్లో గురువారం ఓ మోస్తరు వర్షం కురిసింది.ఎపి ముఖ్యమంత్రి వైఎస్.జగన్ అధికారులుతో రివ్యూ మీటింగ్ నిర్వహించి.. ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు.
0 Comments:
Post a Comment