AP Rains: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలపై ఎఫెక్ట్
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వాతావరణం పూర్తిగా మారిపోయింది.. కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు..
ఇంకా కొన్ని చోట్ల భారీ వర్షలు కురుస్తున్నాయి.. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అయితే ఈ రోజు వడగళ్లవానతో భారీ నష్టం వాటిల్లింది.. హైదదరాబాద్, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియగా.. శివారు ప్రాంతాలు, కొన్ని జిల్లాల్లో వడగళ్లవాన పడింది.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.
ఐఎండీ ప్రకారం ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదగా కొంకణ్ తీరం వరకు ద్రోణి అవరించి ఉందని తెలిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో రాబోవు మూడు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలతో పాటుగా పిడుగులు, భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది.. పిడుగుపాటు నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది..
రాబోవు మూడు రోజుల రాష్ట్రంలో వాతావరణం ఎలా ఉండబోతోందనే వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.. ఇక, శనివారం రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని.. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.. ఇక, ఆదివారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓ ప్రటనలో పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment