Ant Facts : చీమలు ఎందుకు నిద్రపోవు? వాటిని అంటార్కిటికా పంపితే ఏమవుతుంది?
మనుషులైనా, జంతువులైనా, పక్షులైనా, జలచరాలైనా..
నిద్ర కామన్. అలసిన ప్రతి హృదయం.. నిద్ర కోరుకుంటుంది. ఆ నిద్రలోనే విశ్రాంతి పొందుతుంది. కానీ అత్యంత ఎక్కువగా పనిచేసే చీమలు మాత్రం నిద్రపోవు. అందుకు ప్రత్యేక కారణం ఉంది. చాలా కీటకాల లాగానే చీమలకు కూడా కేంద్రీయ నాడీ వ్యవస్థ (centralized nervous system) లేదు. ఇది మనుషులకూ, ప్రాణులకూ ఉంది. ఇది లేకపోవడం వల్లే చీమలు నిద్రపోవు.
చీమలకు కేంద్రీయ నాడీ వ్యవస్థ బదులు.. గాంగ్లియా క్లస్టర్ ఉంటుంది. వీటినే నాడీ కణాలు అంటారు. చీమల శరీరం మొత్తం ఇవి ఉంటాయి. అందువల్ల చీమలు మనం నిద్రపోయినట్లుగా నిద్రపోవు. వాటి నిద్ర విధానం వేరుగా ఉంటుంది.
చీమలు నిద్ర బదులు విశ్రాంతి తీసుకుంటాయి. ఆ సమయంలో అవి యాక్టివ్‌గా ఉండవు. లేదా పనిని నెమ్మదిగా చేస్తాయి. అదో రకమైన నిద్ర అనుకోవచ్చు. అలాగని అవి ఆ సమయంలో తమకు సంబంధం లేనట్లు ఉండవు. శత్రువులు దాడి చేసేలా ఉన్నా లేక ఆహారం ఫలానా చోట ఉంది అని తెలిసినా.. చీమలు.. ఆ విశ్రాంతి లోనే పని కూడా చేస్తాయి.
మనం ఎలాగైతే నిద్రపోకపోతే చనిపోతామో... చీమలకు విశ్రాంతి తీసుకోకపోతే మరణం తప్పదు. విశ్రాంతి సమయంలో చీమల ఎనర్జీ ఆదా అవుతుంది. అది అవసరం అయినప్పుడూ, తమ కాలనీని నిర్మించేటప్పుడూ ఉపయోగపడుతుంది.
చీమల రాజ్యంలో మనలాగా అవి నిద్రపోవడానికి వీలు కూడా ఉండదు. ఎందుకంటే కాలనీ నిర్మాణంలో వేర్వేరు చీమలకు వేర్వేరు బాధ్యతలు ఉంటాయి. అంటే.. కాపలా కాయడం, పిల్ల చీమల్ని చూసుకోవడం, ఆహారం జోలికి శత్రువులు రాకుండా అడ్డుకోవడం ఇలా ఎన్నో. అందువల్ల నిద్ర మాటే వాటి జీవితంలో ఉండదు. కాలనీ కోసం అవి అంతలా శ్రమిస్తాయి.
ఇక అంటార్కిటికా ప్రశ్నకు ఆన్సర్ చూద్దాం. చీమలు ప్రపంచంలోని అన్ని ప్రదేశాల్లో ఉన్నాయి. అంటార్కిటికాలో మాత్రం లేవు. ఆ ఖండానికి మిగతా ఖండాలతో లింక్ లేకపోవడం.. అది పూర్తిగా మంచుతో నిండి ఉండటంతో అక్కడ చీమలు లేవు. ఐతే... మీరు గనుక అంటార్కిటికాకు కొన్ని చీమల్ని తీసుకెళ్తే... అక్కడ కూడా అవి జీవించగలవు.
నిజానికి తాము ఎక్కడ జీవించాలని అనుకుంటే అక్కడ చీమలు జీవించగలవు. ఎక్కువగా అవి ఇళ్లలోనే ఉంటాయి. ఎందుకంటే అవి షెల్టర్, ఆహారం, నీరు ఉన్న చోట ఉంటాయి. ఇళ్లలో కాలనీలు నిర్మిస్తే మనం ఊరుకోం కదా.. అందువల్ల ఇళ్ల బయట కాలనీలు నిర్మించుకొని.. ఆహారం మాత్రం ఇళ్ల నుంచి మోసుకెళ్తాయి. చీమలు తమ బరువు కంటే 20 రెట్లు ఎక్కువ బరువును మొయ్యగలవు.
0 Comments:
Post a Comment