Andhra Pradesh: ఏపీలో ఒంటిపూట బడులు అప్పటి నుంచే.! టైమింగ్స్, వివరాలు ఇవిగో..!!
ఒకవైపు వైరల్ ఫీవర్లు.. మరోవైపు పెరిగిపోతున్న కరోనా కేసులు.. ఇలాంటి తరుణంలో దగ్గు, జ్వరం, జలుబు లాంటి లక్షణాలు ఉన్న పిల్లలను స్కూళ్లకు పంపకూడదని చెబుతోంది పాఠశాల విద్యాశాఖ.
అయితే ఇప్పటివరకు మాత్రం ఏపీలో ఒంటిపూట బడులు ఎప్పటి నుంచి మొదలు కానున్నాయన్న దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు.
గతేడాది విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైన నేపధ్యంలో ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఒంటిపూట బడులను మొదలుపెట్టారు. అయితే ఈసారి సరైన సమయానికి తరగతులు ప్రారంభించినప్పటికీ.. ఒంటిపూట బడులపై ఏపీ విద్యాశాఖ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అటు ఇప్పటికే మార్చి 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు మొదలైపోయాయి.
ఇదిలా ఉంటే.. గతేడాది మాదిరిగానే.. ఏప్రిల్ 4 నుంచే ఏపీలో ఒంటిపూట బడులను ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై మరికొద్ది రోజుల్లోనే అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే ఛాన్స్ ఉంది.
0 Comments:
Post a Comment