అల్లోవెరా కేవలం ఆరోగ్యమే కాకుండా.. చర్మానికి, కేశాలకు కూడా ప్రయోజనకరం. వివిధ రకాల మందుల తయారీలో కూడా అల్లోవెరా అద్భుతంగా ఉపయోగపడుతుంది.
అల్లోవెరా ఉపయోగం చాలా రకాలుగా ఉంటుంది. మండిన గాయాలు, దెబ్బలు, జీర్ణ సంబంధిత సమస్యలకు అల్లోవెరా అద్భుతంగా ఉపయోగపడుతుంది. హోమ్ రెమిడీగా అల్లోవెరా అద్భుతంగా దోహదపడుతుంది. అల్లోవెరాను రోజువారీ డైట్‌లో భాగం చేసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
అల్లోవెరా తినడం వల్ల కలిగే లాభాలు
జీర్ణక్రియ మెరుగుదల
అల్లోవెరాలో ఉండే కొన్ని ప్రత్యేక ఎంజైమ్‌లు భోజనం అరుగుదల, పోషక పదార్ధాల సంగ్రహణను మెరుగుపర్చేందుకు దోహదపడతాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జీర్ణక్రియ సంబంధిత సమస్యలైన స్వెల్లింగ్, మలబద్ధకం, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్‌ను తగ్గిస్తాయి.
రోగ నిరోధక శక్తి
అల్లోవెరాలో పాలీశాకరైడ్స్ ఉంటాయి. వీటిని కాంప్లెక్స్ షుగర్ అంటారు. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలుంటాయి. పోలీశాకరైడ్ వైట్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిని పెంచడంలో ఉపయోగపడతాయి. ఇన్‌ఫెక్షన్, వ్యాధుల్నించి సంరక్షిస్తాయి.
బరువు తగ్గడం
అల్లోవెరా సేవించడం వల్ల అధిక బరువు సమస్య కూడా అద్భుతంగా తగ్గుతుంది. అల్లోవెరా జెల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, డీటాక్సిఫైయింగ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడతాయి. బరువు తగ్గించేందుకు కీలకంగా మారతాయి.
సమృద్ధిగా పోషకాలు
అల్లోవెరా చాలా రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేయడంలో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ ఎ, సి, ఇతో పాటు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు చాలా ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడేందుకు ఉపయోగపడతాయి. ఫ్రీ రాడికల్స్ అనేవి శరీర కణాలకు నష్టం కల్గిస్తాయి.
అల్లోవెరా ఎలా తీసుకోవాలి
1. అల్లెవెరాను సలాడ్, సూప్ లేదా స్టాజ్ రూపంలో సులభంగా కలుపుకుని తీసుకోవచ్చు.
2. అల్లోవెరా జెల్‌ను ఉదయం సమయంలో దలియా లేదా పెరుగులో కలుపుకుని తీసుకోవచ్చు.
3. అల్లోవెరాను స్మూదీలో కలిపి తీసుకోవచ్చు. ఇది అత్యంత సులభమైన విధానంగా భావిస్తున్నారు.
4. అల్లోవెరాను ఇతర పండ్ల జ్యూస్‌తో కలిపి సేవించవచ్చు.
0 Comments:
Post a Comment