మనదేశంలో పలు చోట్లు అనేక సందర్భాల్లో గాలిలోకి కాల్పులు(aerial fire) జరిగిన ఘటనలు తెరపైకి వస్తుంటాయి.
పలు రాష్ట్రాల్లో పెళ్లి వేడుకల్లో గాలిలోకి కాల్పులు జరిపిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి, మరికొందరు తమ దర్పాన్ని ప్రదర్శించేందుకు ఏరియల్ ఫైరింగ్ చేస్తుంటారు.
అయితే ఆకాశంలోకి తుపాకీలో నుంచి దూసుకెళ్లిన బుల్లెట్(Bullet) తిరిగి నేలకు చేరుతుందా లేదా అనే విషయం మీకు తెలుసా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.
దీనికి ముందుగా, తుపాకీ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. తుపాకీ నుండి కాల్చే బుల్లెట్‌ను కాట్రిడ్జ్(cartridge) అంటారు.
కాట్రిడ్జ్‌లోని చివరి భాగాన్ని ప్రైమర్ కాంపౌండ్ అంటారు. కాల్పుల సమయంలో గన్‌పౌడర్ పేలుతుంది. కాల్పులు జరిపాక తుపాకీ నుండి బుల్లెట్ బయటకు వస్తుంది.
గన్ బుల్లెట్(Gun bullet)లో మూడు భాగాలు ఉంటాయి. ముందు భాగాన్ని బుల్లెట్ అని, మధ్య భాగాన్ని కవర్ అని అంటారు. అందులో గన్‌పౌడర్(Gunpowder)ని నింపుతారు.
బుల్లెట్‌లోని చివరి భాగాన్ని ప్రైమర్ కాంపౌండ్ అని అంటారు. గాలిలోకి దూసుకెళ్లిన బుల్లెట్ తిరిగి నేలపై పడుతుంది. ఈ సమయంలో ఎవరికైనా గాయం కావచ్చు.
గాలిలో కాల్పులు(firing) జరిపినప్పుడు బుల్లెట్ చాలా దూరం ప్రయాణించి ఆ తర్వాత తిరిగి భూమికి చేరుకుంటుంది. దీనికి గల కారణం భూమికున్న గురుత్వాకర్షణ శక్తి(Gravitational force).
ఇది ఒక నిర్ణీత సమయం తర్వాత వస్తువును తన వైపుకు లాగుతుంది. బుల్లెట్ గాలిలో ఎంత దూరం ప్రయాణిస్తుంది అనేది గాలి వేగం, తుపాకీ నాణ్యత(Gun quality)పై ఆధారపడి ఉంటుంది.
కాగా నేలపైకి వస్తున్నప్పుడు బుల్లెట్ వేగం తగ్గుతుంది. ఏరియల్ ఫైర్(Aerial fire) సమయంలో మధ్యలో ఏదైనా అడ్డుగా వస్తే, దానికి బుల్లెట్ తగిలే అవకాశాలున్నాయి.
0 Comments:
Post a Comment