ఆధార్ కార్డ్ ఉన్నవారికి శుభవార్త.. ఈ అవకాశం మార్చి 15 నుంచి జూన్14 వరకే..
12 అంకెల గుర్తింపు సంఖ్యను (UIDIA) భాతర విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఆధార్ కార్డును జారీ చేసింది.
ఇది చాలా అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు పొందాలనుకున్నా, దేనికైనా అప్లికేషన్ పెట్టాలనుకున్నా ఆధార్ చాలా ముఖ్యమైనది. బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ నుంచి ఉద్యోగ వెరిఫికేషన్ దాకా ఇలా ప్రతీ దానికి ఆధార్ కార్డ్ తప్పనిసరిగా చేశారు. ఇక ఎంతో కీలకంగా మారిన ఆధార్ కార్డు విషయంలో UIDIA తాజాగా ఓ గుడ్ న్యూస్ ను తెలిపింది. విషయం ఏంటంటే?
ఆధార్ నమోదు ప్రక్రియలో భాగంగా కొన్ని వివరాలు తప్పులు దొర్లి ఉంటాయి. వాటిని సరి చేసుకునేందుకు మనం ఆధార్ సెంటర్ కు వెళ్లడమో, లేదంటే ఆన్ లైన్ ద్వారా సరిచేసుకోవడమో చేస్తాం. అయితే ఇలాంటి అప్ డేషన్ చేసుకోవాలనుకునే వారికి కొన్ని రోజులు ఉచితంగా చేసుకోవచ్చని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ తెలిపింది. ఈ అవకాశం మార్చి 15 నుంచి జూన్14 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని UIDIA తాజా ప్రకటనలో తెలిపింది.
గతంలో ఆధార్ అప్ డేషన్ చేసుకోవాలంటే ఆధార్ పోర్టల్ ద్వారా రూ.25 చెల్లించి చేసుకునేవాళ్లం. కానీ, ఇప్పుడు అవేం లేకుండా ఈ ఉచిత అవకాశం పరిమిత రోజుల్లో మాత్రం ఉంటుందని, అప్ డేషన్ చేసుకోవాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని UIDIA తెలిపింది. మరి ఇంకెందుకు ఆలస్యం. అప్ డేషన్ చేసుకోవాలనుకునేవారు వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.
0 Comments:
Post a Comment