Aadhaar Update: కేంద్రం భారీ శుభవార్త.. ఆధార్ అప్‌డేట్ ఛార్జీలు మాఫీ, ఇక ఒక్క రూపాయి కట్టకుండానే వివరాలు మార్చుకోవచ్చు!
Aadhaar Charges | ఆధార్ కార్డు ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త.
కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు దారులకు భారీ తీపికబురు అందించింది. యూఐడీఏఐ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆధార్ కార్డులో వివరాల అప్‌డేట్‌కు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదని వెల్లడించింది.
ఆధార్ అప్‌డేట్ చార్జీలను తొలగిస్తున్నట్లు యూఐడీఏఐ పేర్కొంది. అయితే కేవలం ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డు వివరాల అప్‌డేట్‌కు మాత్రమే ఇది వర్తిస్తుందని గుర్తించుకోవాలి. అంతేకాకుండా కేవలం కొంత కాలం వరకే ఈ బెనిఫిట్ అందుబాటులో ఉండనుంది.
ఒకవేళ ఆధార్ కార్డు కలిగిన వారు ఆధార్ సెంటర్‌కు వెళ్లి కార్డు వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని భావిస్తే మాత్రం చార్జీలు చెల్లించుకోవాల్సి వస్తుంది. రూ. 50 చార్జీ పడుతుంది. అందువల్ల ఆధార్ కార్డు దారులు ఈ విషయాన్ని గమనించాలి.
ఈ ఉచిత ఆధార్ అప్‌డేట్ ఫెసిలిటీని ఉపయోగించుకోవాలని యూఐడీఏఐ ప్రజలకు కోరింది. మూడు నెలల వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. 2023 మార్చి 15 నుంచి 2023 జూన్ 14 వరకు ఉచిత అప్‌డేట్ ఫెసిలిటీ పొందొచ్చని వివరించింది.
మీరు ఆధార్ కార్డు పొంది పదేళ్లు అయ్యి ఉంటే.. ఇప్పటి వరకు ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోకపోతే.. ఇప్పుడు మీరు ప్రూఫ్ ఐడెంటిటీ అప్‌లోడ్ చేసి ఆధార్ వివరాలు అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఒక్క రూపాయి కట్టాల్సిన పని లేదని యూఐడీఏఐ ట్వీట్ చేసింది.
అందువల్ల మీరు ఆధార్ కార్డులో వివరాలు అప్‌డేట్ చేసుకోవాలని భావిస్తే.. ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఉచితంగానే ఆధార్ వివరాలను మార్చుకోవచ్చు. లేదంటే తర్వాత చార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది.
ఇకపోతే ఆధార్ కార్డులో వివరాలు అప్‌డేట్ చేసుకోవాలని భావించే వారు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. కచ్చితంగా సపోర్ట్ డాక్యుమెంట్ అంటే ప్రూఫ్ డాక్యుమెంట్ కావాలి. అప్పుడే వివరాలు మార్చుకోగలం.
అంతేకాకుండా ఆధార్ కార్డులో ఉన్న వివరాలను మార్చుకోవడానికి కొని సార్లు మాత్రమే అవకాశం ఉంటుంది. అంటే పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వివరాలను ఎన్ని సార్లు పడితే అన్ని సార్లు మార్చుకోవడం కుదరదు.
అయితే ఆధార్ కార్డులో అడ్రస్ వివరాలను మాత్రం సులభంగానే మార్చుకోవచ్చు. పేరు, జెండర్ వంటి వివరాలను కేవలం ఒక్కసారి మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది. అందువల్ల ఆధార్ కార్డు కలిగిన వారు ఈ విషయాన్ని కూడా గుర్తించుకోవాలి. ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలు మార్చుకోవాలని భావించే వారు కచ్చితంగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి.
యూఐడీఏఐ చేసిన ట్వీట్ ఇదే.. దీని ప్రకారం మూడే నెలలు ఎలాంటి చార్జీలు లేకుండా ఉచితంగా ఆధార్ కార్డు వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు.
0 Comments:
Post a Comment