7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుందంటే
1. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 4 శాతం డియర్‌నెస్ అలవెన్స్ పెంచిన (DA Hike) సంగతి తెలిసిందే.
ఉద్యోగులకు బేసిక్ వేతనంపై 4 శాతం అదనంగా డీఏ లభిస్తుంది. ఉద్యోగులకు డీఏ పెరిగితే పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ కూడా పెరుగుతుంది. కాబట్టి పెన్షనర్లకు కూడా బేసిక్ వేతనంపై 4 శాతం డీఆర్ పెరుగుతుంది.
2. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం 47.58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 69.76 లక్షల మంది పెన్షనర్లకు మేలు చేస్తుంది. ఇప్పటివరకు 38 శాతం లభించిన డీఏ ఇప్పుడు 42 శాతం లభిస్తుంది. అంటే బేసిక్ వేతనంపై 42 శాతం డీఏ లభిస్తుందన్నమాట.
3. ఉదాహరణకు ఓ ఉద్యోగి బేసిక్ వేతనం రూ.31,400 అనుకుంటే 38 శాతం లెక్కన రూ.11,932 డీఏ వచ్చేది. ఇప్పుడు డీఏ 42 శాతానికి పెరిగింది. కాబట్టి ఇకపై రూ.13,188 డీఏ లభిస్తుంది. అంటే అదనంగా వేతనం రూ.1256 లభిస్తుంది. పెన్షనర్లకు కూడా ఇదే లెక్క వర్తిస్తుంది.
4. ఉదాహరణకు ఓ పెన్షనర్‌కు రూ.25,200 బేసిక్ పెన్షన్ లభిస్తున్నట్టైతే 38 శాతం డీఆర్ ప్రకారం రూ.9576 డీఆర్ లభించేది. ఇప్పుడు 42 శాతం డీఆర్ వర్తిస్తుంది కాబట్టి రూ.10,584 డీఆర్ పొందొచ్చు. అదనంగా డీఆర్ రూ.1008 పెరిగినట్టైంది.
5. కేంద్ర ప్రభుత్వం 2023 జనవరి 1 నుంచి పెరిగిన డీఏ, డీఆర్ అమలు చేస్తోంది. రెండు నెలలకు సంబంధించిన బకాయిలు కూడా రాబోయే వేతనంలో జమ అవుతాయి. 2023 జూన్ వరకు 42 శాతం డీఏ కొనసాగుతుంది. 2023 జూలైలో మరోసారి డీఏ పెరుగుతుంది.
6. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్‌లో ఉన్న డిమాండ్లు, పలు కీలక నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 18 నెలల డీఏ బకాయిలు రావాల్సి ఉంది. ఉద్యోగులకు రూ.2 లక్షల వరకు డీఏ బకాయిలు రావాల్సి ఉందని ఓ అంచనా.
7. ఇక ప్రస్తుతం 2.57 శాతంగా ఉన్న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.68 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే హౌజ్ బిల్డింగ్ అలవెన్స్ ప్రస్తుత వడ్డీ రేటు 7.1 శాతం. 2023 మార్చి 31 వరకే ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. వడ్డీ రేటు విషయంలోనూ ఊరట కోసం ఎదురుచూస్తున్నారు.
0 Comments:
Post a Comment