ఉదయం 5.30 కే స్కూల్.. ప్రభుత్వం వినూత్న నిర్ణయం!
ఇటీవల విద్యార్థులపై అటు స్కూల్ యాజమాన్యం ఇటు తల్లిదండ్రుల ఒత్తిడి పెరిగిపోతూ ఉన్నాయి. కళాశాలల యాజమాన్యం ర్యాంక్ లు రావాలంటూ ఒత్తిడి తీసుకు వస్తున్నారు.
దీంతో చదువు అంటేనే భయం.. విసుగు చెందుతున్న కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. సాధారణంగా ఏ విద్యార్థి అయినా తెల్లవారుజామున లేచి స్కూల్ కి వెళ్లాలంటే చిరాకుపడుతుంటారు. తల్లిదండ్రులు విద్యార్థులను ఉదయం లేపి స్కూల్ కి తయారు చేసి పంపిస్తుంటారు. ఉదయం 9 గంటలకు స్కూల్ అంటేనే ఇంత హడావుడి ఉంటే.. ఇప్పుడు ఉదయం 5.30 గంటలకు స్కాల్ ప్రారంభం అంటే తల్లిదండ్రులు, విద్యార్థులు అవస్థలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మరి ఆ ప్రదేశం ఎక్కడ? మరీ ఇంత ఉదయం స్కూల్ ఆరంభం అవుతుందా? ఏ ప్రాంతంలో అన్న విషయం గురించి తెలుసుకుందాం.
సాధారణంగా ఉదయం 9 గంటలకు స్కూల్ అంటే 7 గంటల నుంచి తల్లిదండ్రులు, విద్యార్థులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తుంది.. చక్కగా తయారై సైకిళ్లు, స్కూల్ బస్ లలో వెళ్తుంటారు విద్యార్థులు. అలాంటిది ఇండోనేషియాలో ఓ సిటీలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఉదయం 5.30 గంటలకే స్కూళ్లు మొదలు పెట్టేస్తున్నారు. పాఠశాల విద్యార్థులే కాదు.. 12 వ తరగతి చదివే విద్యార్థులకు కూడా ఈ కండీషన్ వర్తిస్తుంది. దీంతో తెల్లవారుజామున లేచి స్కూల్ కి తయారై వెళ్లాలంటే నానా అవస్థలు పడుతున్నారు.. వారితో పాటు తల్లిదండ్రులు సైతం ఇబ్బంది పడుతున్నారు. మరీ ఇంత ఉదయం స్కూల్ కి పెట్టడం అవసరమా అని అధికారులను అడిగితే.. ఇలా చేస్తేనే పిల్లల్లో మంచి క్రమశిక్షణ వచ్చి చదువుపై శ్రద్ద కలుగుతుందని అంటున్నారు. గత నెల గవర్నర్ విక్టర్ లైస్కోదత్ ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించారు.
గతంలో ఇండోనేషియాలో ఉదయం 8 గంటల సమయంలో స్కూళ్లు మొదలు అయ్యేవి.. కానీ ఇప్పుడు ఉదయం 5.30 కి టైమింగ్ మార్చారు. అంతేకాదు సమయానికి స్కూల్కు రావాలని కండీషన్ కూడా పెట్టారు అధికారులు. ఇక ఉదయం పిల్లలతో పాటు తల్లిదండ్రులు లేచి తయారు చేసి రోడ్లపై బస్సులు, ట్యాక్సీల కోసం పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఈ విషయంలో తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.. తమ పిల్లలు బాగా అలసి పోతున్నారని.. నిద్రలేమి వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ దెబ్బతినే అవకాశం ఉందని వాపోతున్నారు.
ఈ సందర్భంగా ఓ విద్యార్థి తల్లి మాట్లాడుతూ.. 'పిల్లలు చీకట్లో లేచి బయటకు వెళ్లడం చాలా ఇబ్బందిగా ఉంది.. మరి వాళ్ల సెక్యూరిటీకి ఎవరు బాధ్యత వహిస్తారు? దూరంగా స్కూల్ ఉన్నవాల్లు ఉదయం 4 గంటలకు లేచి పనులు మొదలు పెట్టాల్సి వస్తుంది. నాకు 16 ఏళ్ల పాప ఉంది.. 4 గంటలకు లేచి తయారై బైక్ పై వెళ్తుంది.. పాప ఎంతో అలసిపోయి ఇంటికి వస్తుంది.. నిద్రలేమి వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. హెల్త్ పై ఇంపాక్ట్ పడే ఇలాంటి రూల్స్ వెంటనే మారిస్తే బాగుంటుంది' అని ఆవేదన వ్యక్తం చేసింది.
0 Comments:
Post a Comment