*ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పాఠశాలలకు 13న సెలవు*
*ఈనాడు - అమరావతి, తిరుపతి, న్యూస్టుడే- తిరుపతి, చిత్తూరు (విద్య):*
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే ప్రాంతాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు ఈ నెల 13న (సోమవారం) సెలవు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ గారు శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల డీఈ వోలకు ఆదేశాలివ్వాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్కు సూచించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే రోజున సెలవుపై ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఓటేసేందుకు ప్రత్యేక సాధారణ సెలవు (స్పెషల్ క్యాజువల్ లీవ్)ను ముఖ ఆధారిత హాజరు యాప్లో నమోదు చేయాలని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
పాఠశాలలకు సెలవు ప్రకటించకుండా ఉపాధ్యాయులు స్పెషల్ సీఎల్ పెట్టుకుంటే విద్యార్థులు రావాలా వద్దా అన్న సందిగ్ధం తల్లిదండ్రుల్లో నెలకొంది.
ఈ విషయమై ఉపా ధ్యాయ సంఘాల నాయకులు ఉన్నతాధికారుల వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఉపాధ్యాయులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు అనుగుణంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే జిల్లాల్లో అన్ని పాఠశాలలకు సెలవుగా ప్రకటిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
అయితే కళాశాలల అధ్యాపకులకు స్పెషల్ సీఎల్ మాత్రమే ఇచ్చారు. పాఠశాలలకు మాదిరిగానే కళాశాలకు సెలవు ప్రకటించాలని అధ్యాపకులు కోరుతున్నారు.
0 Comments:
Post a Comment