మాజీ భార్యపై 100 కోట్ల పరువునష్టం దావా వేసిన నటుడు..
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తన మాజీ భార్య అంజనా పాండే, మరియు ఆయన సోదరుడు షమాజుద్దీన్ లకు ఊహించని షాక్ ఇచ్చారు. తన పరువుకు భంగం కలిగించేలా వారు వ్యవహరించారని వారు ఇరువురిపై 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు.
తప్పుదారి పట్టించేలా వారు తనపై ఆరోపణలు చేశారని, తనకు కలిగిన పరువు నష్టం మరియు వేధింపులకు పరిహారంగా 100 కోట్ల రూపాయలు ఇవ్వాలని నవాజుద్దీన్ సిద్ధిఖీ పరువు నష్టం దావా వేయడం బాలీవుడ్లో సంచలనంగా మారింది. నటుడి పరువు తీయకుండా, సోషల్ మీడియాలో ఎటువంటి కామెంట్లు చేయకుండా, పెట్టిన పోస్టులను తొలగించాలని బాంబే హైకోర్టులో నవాజుద్దీన్ సిద్ధిఖీ పిటిషన్ దాఖలు చేశారు. అంజన పాండే మరియు షమాజుద్దీన్ లిఖిత పూర్వకంగా తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తనపై వారు చేసిన తప్పుడు ప్రచారానికి సంబంధించి వాళ్ళు సంప్రదించిన వ్యక్తుల గురించి పూర్తి సమాచారాన్ని కూడా బహిర్గతం చేయాలని కోర్టు ఇద్దరినీ ఆదేశించాలని ఆయన తన పిటీషన్ లో పేర్కొన్నారు. నవాజుద్దీన్ తన సోదరుడు షమాజుద్దీన్ తనకు ఉద్యోగం లేదని చెప్పినప్పుడు, తనకు మేనేజర్ గా నియమించుకున్నాడని, గుడ్డిగా సోదరుడిని నమ్మి డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, అకౌంట్ల పాస్వర్డ్ లు అన్ని అతనికి ఇచ్చాడని, అయితే అతను సోదరుడినే మోసం చేశాడని తన దావాలో పేర్కొన్నారు.
నవాజుద్దీన్ డబ్బులతో షమాజుద్దీన్ ఆస్తులు కొనుగోలు చేశారని, ఇదంతా తెలిసి ప్రశ్నించినందుకు మాజీ భార్యను తనపై తప్పుడు కేసులు పెట్టమని, ఆరోపణలు చేయమని ప్రేరేపించాడని పేర్కొన్నారు. తన సోదరుడు మరియు మాజీ భార్య ఏకంగా తనకు సంబంధించిన 21 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని నవాజుద్దీన్ ఆరోపించారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ న్యాయవాది సునీల్ కుమార్ ద్వారా దాఖలు చేయబడిన ఈ వ్యాజ్యం జస్టిస్ రియాజ్ చాగ్లా ధర్మాసనం ముందు విచారణకు రానుంది. మార్చి 30 వ తేదీన దీనిపై విచారణ జరగనుంది.
0 Comments:
Post a Comment