మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ, స్వచ్చమైనా గాలి, కల్తిలేని ఆహరం తీసుకుంటే సరిపోదు.
ఎలాక్ట్రిక్ వస్తువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చుట్టూ ఎలక్ట్రిక్ పరికరాలు, రేడియేషన్ ఇచ్చి సెల్ టవర్లు వంటివన్నీ ప్రజల అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణాలు.
ప్రకృతి జీవనం అంటే చెట్లు, పుట్టలు.. కొండలు, పక్షులతో కలిసి ఉండడామే. ప్రకృతిలో భాగమైన మనిషి పాశ్చాత్య నాగరికతకు అలవాటుపడి మానసిక, శారీరక ఆరోగ్యానికి దూరమై కాలుష్య ప్రపంచంలో భారంగా జీవితాన్ని సాగిస్తున్నాడు. అయితే ఓ తండా ఆధునిక మానవుడికి తిరిగి ప్రకృతిని పరిచయం చేసింది.
ప్రకృతి-మనిషి సంబంధాన్ని బలోపేతం చేసి భవిష్యత్తులో మానవ మనుగడకు పొంచి ఉన్న ముప్పును తప్పించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రాజమ్మ తండా వాసుల జీవన విధానం ప్రత్యేకంగా ఉంది. ఈ తాండలో సుమారు 200 ల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.
ఇక్కడ సహజసిద్ధ వాతావరణంలో జీవించడం వల్ల తండా వాసులు రోగ నిరోధిక శక్తి ఎక్కువగా కలిగి ఉంటున్నారు. గ్రామంలోని ప్రజల్లో తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగి ఇన్ఫెక్షన్లు, జబ్బులను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది.
తాజా గాలిని పీల్చుకోవడం వల్ల మెదడు కొత్త ఉత్సాహంతో పనిచేస్తుంది... ఇదే రాజమ్మ తండా వాసులకు వరంగా మారింది.
పచ్చని ప్రకృతి మధ్య జీవించే వీరి జీవనోపాధి వ్యవసాయం. వీరి సగటు జీవనం 90 ఏళ్లకు పైనే ఉంది. అయితే ఈ తండాలో గత మూప్పై ఏళ్లలో ఏడుగురు మాత్రమే మృతిచెందడం విశేషంగా చూడాలి.
చనిపోయిన ఏడుగురిలో కూడా నడి వయస్సు కలిగిన వాళ్లు ఇద్దరు మాత్రమే ఉన్నారు. మిగిలిన ఐదుగురిలో ఇద్దరు వంద ఏళ్లు పూర్తిచేసుకున్నారు.
మరో ముగ్గురు 90 ఏళ్ల వయసులో మరణించారు. ఈగ్రామంలో ఇప్పటికీ 90 ఏళ్లపైబడి వాళ్లంతా వ్యవసాయం చేస్తూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. అయితే వీళ్ల ఆరోగ్య రహస్యం ఏమిటంటే వంటలకు గ్యాస్ స్టౌవ్ కాకుండా కట్టెల పొయ్యిపై వండుకుంటారు.
ప్రధాన ఆహారంతో పాటు మక్క రొట్టెలు, అల్లం-ఎల్లిగడ్డ కారంతో తింటారు. ఏ ఇంట్లో కూడా రొట్టె లేకుండా ఒక్కపూట కూడా గడవదని తండా వాసులంటారు.
ఎరువులు, పురుగు మందులతో పెంచిన కూరగాయలు కాకుండా ఇళ్ల పక్కనే ఉన్న తమ పొలాల్లో పండించిన తాజా కూరగాయలతో కూరలు వండుకొని తింటారు.
తండాలోని ప్రతి ఒక్కరికి సగటున నాలుగు ఎకరాల భూమి ఉంది. అంతే కాదు ప్రతి ఇంట్లో టీవీ, ఫోన్ తప్ప ఎలాంటి ఎలక్ట్రిక్ పరికారాలు, గృహోపకరణాలు ఉండవు.
మినరల్ వాటర్ కామన్‌గా మారిన ప్రస్తుత సమాజంలో ఈ తండావాసులు మాత్రం బోరు నీళ్లనే తాగుతారు. తండాకు సమీపంలోనే వాటర్ ప్లాంట్ ఉన్నప్పటికీ మినరల్ వాటర్ తాగడానికి ఎవరు కూడా ఇష్టపడరు.
ప్రపంచాన్నే వణికించిన కరోనా వైరస్ రాజమ్మ తండా దరి చేరలేదు. వివిధ ఉద్యోగాల్లో స్థిరపడిన తండా వాసులు కరోనా టైమ్‌లో తండాకు వచ్చి సేఫ్ జోన్ లోకి వెళ్లారు.
మేకలు, ఆవులు పెంచుతుంటారు. ఆవు పేడతో షాంపూ చేస్తారు. గంజి తాగడం, ఎండాకాలం ఎండ దెబ్బ తగిలినప్పుడు మొతుకు పువ్వును నీటిలో ఉడికించి ఆ నీటిలో గుడ్డను పెట్టి శరీరం పై తూడిస్తే కోలుకుంటారు. ఉదయాన్నే ఈతకొమ్మ.. లేదంటే యాపకొమ్మలతోనే పళ్ళు తోముకుంటామని గ్రామస్తులు చెబుతున్నారు.
0 Comments:
Post a Comment