White Hair Problem Solution: శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా ఎలాంటి సమస్యలు లేకుండా జీవించగలుగుతారు. శరీర ఆరోగ్యంగా ఉండడానికి కొబ్బరి నీళ్ల ప్రభావవంతంగా సహాయపడతాయని..
ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, పొటాషియం చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు జుట్టు సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు.
దీనిని తాగడం వల్ల కాకుండా స్ప్రే చేసుకోవడం వల్ల కూడా జుట్టు సమస్యలు దూరమవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జుట్టును హైడ్రేటెడ్ ఉంచడానికి సహాయపడుతుంది.
అంతేకాకుండా పొడి జుట్టు, బలహీనత, నిర్జీవత వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ కొబ్బరి నీళ్ల హెయిర్ స్ప్రేని వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఈ స్ప్రేని ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కొబ్బరి నీళ్ల హెయిర్ స్ప్రే చేయడానికి కావలసిన పదార్థాలు:
కొబ్బరి నీరు 1/4 కప్పు
కలబంద రసం 2 టీస్పూన్లు
జోజోబా నూనె 2 టీస్పూన్లు
కొబ్బరి నీళ్లను హెయిర్ స్ప్రే చేయడం ఎలా?
ఈ స్ప్రేను తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకోవాల్సి ఉంటుంది.
ఆ గిన్నెలో మూడింటిని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
తర్వాత మిశ్రమంగా బాగా కలుపుకోవాల్సి ఉంటుంది.
తర్వాత తయారుచేసిన మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి నిల్వ చేసుకోవాలి.
0 Comments:
Post a Comment