Whatsapp: వాట్సప్ నుంచి మరో కొత్త ఫీచర్.. ఇకపై మెసేజ్ పంపించిన తర్వాత..
యూజర్లకు సరికొత్త అనుభూతిని పరిచయం చేయడంలో ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ 'వాట్సప్' (Whatsapp) ఎల్లప్పుడూ ముందుంటుంది.
ఎప్పటికప్పుడు నూతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంటుంది. ఎప్పటిలాగానే తాజాగా మరో కీలకమైన కొత్త ఫీచర్‌ను పరిచయం చేసేందుకు సన్నద్ధమవుతోంది. పంపించిన మెసేజులను (sent messages) ఎడిట్ (Edit) చేసుకునే ఆప్షన్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సప్ బృందం పనిచేస్తోంది. ముందుగా ఐవోఎస్ బెటా యూజర్లకు (iOS beta users) పరిచయం చేయడంపై కృషిచేస్తున్నట్టు వాట్సప్‌కు సంబంధించిన అప్‌డేట్‌లను రిపోర్ట్ చేసే వాబెటాఇన్ఫో (Wabetainfo) వెబ్‌సైట్ తన రిపోర్టులో పేర్కొంది. వాట్సప్‌కు సంబంధించి త్వరలో తీసుకురానున్న అప్‌డేట్‌లలో ఈ ఫీచర్ కూడా ఉండనున్నట్టు తెలిపింది.
సందేశం పంపిన 15 నిమిషాల వరకు ఛాన్స్..
వాట్సప్‌లో మెసేజ్ పంపించిన 15 నిమిషాల వ్యవధిలోనే యూజర్లకు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుందని వాబెటాఇన్ఫో రిపోర్ట్ తెలిపింది. ఒకవేళ మెసేజ్ తప్పుగా పంపించినా లేదా మరింత సమాచారాన్ని జోడించాలనుకున్నా ఈ ఎడిట్ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చునని వివరించింది. కాగా సెంట్ మెసేజ్‌ను డిలీట్ చేసుకునేందుకుగానూ 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' ఆప్షన్‌ను ఇప్పటికే వాట్సప్ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక కొత్తగా ఎడిట్ ఫీచర్‌ను అందుబాటులోకి వస్తే.. మెసేజ్ మొత్తాన్ని డిలీట్ చేయకుండా ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది.
కాగా ఈ ఫీచర్ లేటెస్ట్ వాట్సప్ వెర్షన్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అందులోనూ మెసేజులను మాత్రమే ఎడిట్ చేయడం సాధ్యపడుతుంది. మీడియా క్యాప్షన్లను ఎడిట్ చేయడం కుదరదని రిపోర్ట్ పేర్కొంది. మరోవైపు.. ఐవోఎస్ డివైజ్‌లపై ఫొటో క్వాలిటీని మార్చుకునే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బెటా టెస్టింగ్ జరుగుతోంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
0 Comments:
Post a Comment