బరువు పెరుగుట గురించి ప్రతీ ఇంట్లో చర్చ సాగుతూనే ఉంటుంది. ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల పెరుగుతుందని అనుకుంటారు. కొన్నిఆహారాలు తినడం వల్ల ఆకలి పెరుగుతుంది..
తెలియకుండానే మీరు బరువు పెరుగుతారని తెలుసా? కొన్ని ఆహారాలు తింటుంటే ఒక మంచి అనుభూతి కలుగుతుంది. అలాంటివి ఆ కాసేపటికి కడుపు నింపుతాయి.
కానీ అవి మీలో ఆకలి కోరికను పెంచుతాయి. దీనివల్ల బరువు పెరుగుతారు. ఇంకా చెప్పాలంటే.. ఈ ఆహారాలు హైపోథాలమస్ ను ప్రేరేపిస్తాయి. ఆ ఆహారాల లిస్ట్ చెక్ చేయండి.
వైట్ పాస్తా :
శుద్ధి చేసిన పిండి, రొట్టెలు, పాస్తా వంటి అన్ని రకాల సాధారణ కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ స్థాయిలను సులభంగా పెంచుతాయి. ఇవి రక్తంలో విచ్ఛిన్నమవుతాయి.
తద్వారా మెరుగైన శోషణ కోసం ఇన్సులిన్ విడుదల చేయడానికి ప్యాంక్రియాస్ ను ప్రేరేపిస్తుంది. ఫలితంగా దీర్ఘకాలంలో బరువు పెరుగుతారు.
క్యాండీ :
చాక్లెట్లు, స్వీట్స్, డెజర్ట్స్.. ఇలా ఇతర రూపాల్లో ఉన్న మిఠాయిలు ఆరోగ్యానికి విపత్తును కలిగిస్తాయి. వాటిలో చక్కెర ఉందని అనుకుంటారు. కానీ వాస్తవానికి అవి ప్రిజర్వేటివ్స్, ఫ్రక్టోజ్ సిరప్, కార్న్ సిరప్ తో నిండి ఉంటాయి.
ఇవి శరీరాన్ని తగినంత స్థాయిలో లెఫ్లిన్ ను ఉత్పత్తి చేయకుండా నిరోధిస్తాయి. ఆకలిని అణిచివేసే హార్మోన్ ఇది శరీరంలో శక్తి వినియోగాన్ని పెంచుతుంది.
ఫ్రెంచ్ ఫ్రైస్ :
ఎన్నటికీ తగ్గని ఆదరణ పొందుతున్న వాటిల్లో ఒకటి ఫ్రైంచ్ ఫ్రైస్. ఆలుగడ్డలు, నూనె, ఉప్పు మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ మితిమీరిన ప్రతిదీ ఆరోగ్యానికి చేటే చేస్తుంది. ఇవి ఎన్ని తిన్నా ఇంకా తినాలని అనిపిస్తుంటాయి.
చిప్స్ :
ఆలుగడ్డలు, చీజ్, వెల్లుల్లిపొడి, ఉల్లిపాయల పొడితో తయారు చేసిన చిప్స్ కూడా ఎన్ని ఉన్నా సరిపోవు.
ఒక ప్యాక్ తో మొదలు పెట్టిన ఎవరూ దానితో సరిపెట్టరు. మరింత తినాలని ఆశిస్తుంటారు. ఇదొక వ్యసనంలా కూడా మారుతుంది.
ఐస్ క్రీమ్ :
బకెట్ ఐస్ క్రీమ్ పూర్తి చేయడం పెద్ద కష్టమేమీ కాదు. వెనీలా, స్ట్రాబెర్రీ.. ఇలా ఫ్లేవర్స్ దొరికితే ఇక పండుగే.
వీటిలో కొవ్వులు, చక్కెర, ఇతర కేలరీలతో నిండి ఉంటాయి. ఇవి ఊబకాయం పెంచుతాయని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి.
0 Comments:
Post a Comment