Walking For Diabetes: ఇలా ప్రతి రోజు 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే.. 15 రోజుల్లో మధుమేహం మాయం..
Walking For Diabetes: ప్రపంచవ్యాప్తంగా మధుమేహం వ్యాధితో బాధపడుతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా జీవన శైలిలో మార్పులు చేర్పు చేసుకోవాల్సి ఉంటుంది.
లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల వచ్చి ప్రాణానికే ప్రమాదం కావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి రక్తంలో షుగర్ లెవల్స్‌ను తప్పకుండా నియంత్రించుకోవడానికి పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతి రోజూ ఇలా వాకింగ్ చేయడం వల్ల సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం.. మధుమేహంతో బాధపడుతున్నవారు శారీరకంగా చురుకుగా ఉండటం చాలా ముఖ్యం. శరీరం ఫిట్‌గా ఉండే వ్యక్తుల్లో మధుమేహం వచ్చే అవకాశాలు తక్కువ. కాబట్టి రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రించుకోవడానికి తప్పకుండా వాకింగ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యాయామాలు కూడా చేయడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
వాకింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ వ్యాయామాలతో పాటు వాకింగ్ చేయడం వల్ల ప్యాంక్రియాస్ వేగంగా పని చేస్తాయి.
అంతేకాకుండా షుగర్‌లో మెటబాలిజం వేగవంతం అవుతుంది. దీంతో రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.
ప్రతి రోజూ వాకింగ్ చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
డయాబెటిక్ రోగులు ఎంతసేపు నడవాలి?
అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం.. డయాబెటిక్ రోగులు ప్రతిరోజూ 10,000 అడుగులు లేదా కనీసం 30 నిమిషాలు నడవాలని పేర్కోంది. దీంతో వారి బ్లడ్ షుగర్ లెవెల్ అదుపులో ఉండడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉదయం పూట నలడవలేని వారు సాయంత్రం 10-10 నిమిషాలు నడవడం అలవాటు చేసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా నడవడం వల్ల జీర్ణవ్యవస్థ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా ప్రతి రోజూ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.
0 Comments:
Post a Comment