Visakhapatnam the Capital : విశాఖ రాజధాని.. బాంబ్ పేల్చడానికి రెడీ అయిన ఏపీ ప్రభుత్వం
Visakhapatnam the Capital : ఏపీలో వైసీపీ సర్కారు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వేదికగా చేసుకోనుంది.
మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అటు తరువాత స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీబీఏ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్, సమావేశాల డిమాండ్, కీలక బిల్లులు, ప్రతిపక్షాల ప్రతిపాదనలు తదితర విషయాలను సమావేశంలో చర్చించనున్నారు. మార్చి 17న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, విశాఖ నుంచి పాలన వంటి వాటిపై ఈ సమావేశాల్లో ప్రభుత్వం స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. ఎన్నికల చివరి ఏడాది కావడంతో బడ్జెట్ లో అన్నివర్గాలకు సమ ప్రాధాన్యమివ్వాలన్న భావనతో ప్రభుత్వం ఉంది. అందుకు తగ్గట్టుగానే బడ్జెట్ ను రూపకల్పన చేస్తోంది.
వాస్తవానికి ఉగాది నాటికి విశాఖ నుంచి పాలన ప్రారంభించేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది. ముందుగానే బడ్జెట్ సమావేశాలు నిర్ణయించి విశాఖ నుంచి సీఎం పాలన ప్రారంభిస్తారని ప్రకటించడానికి డిసైడ్ అయ్యింది. కానీ ఇంతలో ఎమ్మెల్సీ ఎన్నికలు నోటిఫికేషన్ రావడంతో నిర్ణయం వాయిదా పడింది. ఇప్పుడు మార్చి 17 న బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరువాత సీఎం జగన్ కీలక నిర్ణయం వెల్లడించే చాన్స్ ఉంది. ప్రస్తుతం అమరావతి రాజధాని కేసు సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ప్రభుత్వం ఆశించినట్టుగా త్వరగా విచారణ చేపట్టే అవకాశం కనిపించడం లేదు. అందుకే విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీసు పెట్టి.. అక్కడ నుంచి పాలన సాగించేందుకు వీలుగా వైసీపీ సర్కారు కసరత్తు పూర్తిచేసింది.
పేరుకే మూడు రాజధానులు కానీ.. విశాఖ ఏకైక రాజధాని అన్నదే వైసీపీ అభిమతంగా వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించే క్రమంలో బుగ్గన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో మూడు రాజధానులు అన్నది వ్యూహమే కానీ.. వైసీపీ అభిమతం కాదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై విమర్శలు కూడా ముసురుకున్నాయి. దీంతో వైసీపీ దిద్దుబాటు చర్యలకు దిగిన జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకే ఇప్పుడు ముసుగు తొలగించి విశాఖే రాజధాని అని బాంబు పేల్చేందుకు జగన్ సర్కారు అన్నివిధాలా సిద్ధమవుతోంది.
0 Comments:
Post a Comment