భారతీయులు కొబ్బరికాయను రకరకాలుగా ఉపయోగిస్తారు. హిందూమతం ఆచార సంప్రదాయం ప్రకారం కొబ్బరికి కాయకు ప్రత్యేక స్థానం ఉంది. దేవాలయానికి వెళ్లే ఏ ఒక్క భక్తుడు కూడా కొబ్బరికాయ తీసుకెళ్లకుండా ఉండరు.
కొబ్బరికాయ కొట్టి దేవుళ్లకు మొక్కులు చెల్లిస్తారు. అయితే, కొబ్బరికాయ కొట్టడానికి ముందు ఆ కొబ్బరి పీచును తీసేస్తాం.
గ్రామీణ ప్రాంతాల్లో ఆ పీచును కొందరు గిన్నెలు తోమడానికి ఉపయోగిస్తే.. వ్యాపారాలు చేసేవారు మాత్రం రకరకాల అవసరాలుకు ఉపయోగిస్తారు.
సాధారణంగా చాలా వరకు జనాలు ఆ కొబ్బరి పీచును పక్కకు చెత్త మాదిరిగా పడేస్తారు. కానీ, ఈ విషయం తెలిస్తే మాత్రం ఇక నుంచి ఆ కొబ్బరి పీచును అస్సలు పడేయరు. అవునండీ బాబూ.. కొబ్బరి పీచుకు అంత విలువ ఇచ్చేశాయ్.. ఈ కామర్స్ వెబ్‌సైట్స్.
ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ప్లిప్‌కాట్ తన సైట్‌లో కొబ్బరి పీచును విక్రయానికి పెట్టింది.
అరకిలో కొబ్బరి పీచు ఏకంగా రూ. 350 లకు విక్రయిస్తోంది. ఇది చూసిన జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఆఖరికి కొబ్బరి పీచుకూడా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టే పరిస్థితి వచ్చిందా? అని షాక్ అవుతున్నారు. ఈ ముచ్చట మాకు తెలిసే మేము కూడా పడేసేవారము కాదు కదా అని ఆశ్చర్యపోతున్నారు.
కాగా, కొందరు ఈ పీచు అమ్మకానికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అది కాస్తా వైరల్ గా మారింది.
0 Comments:
Post a Comment