Coconut Water-Lemon Juice Combo | భారతీయులు కొబ్బరి నీళ్లను బాగా ఇష్టపడుతారు. డీహైడ్రేషన్‌కు గురైన శరీరాన్ని తక్షణమే హైడ్రేట్ చేయడంలో కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడుతాయి.
అందుకే వేసవి కాలంలో కొబ్బరి బోండాలకు యమా డిమాండ్ ఉంటుంది.
భారతీయులు కొబ్బరి నీళ్లను బాగా ఇష్టపడుతారు. డీహైడ్రేషన్‌కు గురైన శరీరాన్ని తక్షణమే హైడ్రేట్ చేయడంలో కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడుతాయి. అందుకే వేసవి కాలంలో కొబ్బరి బోండాలకు యమా డిమాండ్ ఉంటుంది.
అయితే సహజసిద్ధమైన ఈ కొబ్బరి నీళ్లను ఏమీ కలపకుండా ఉన్నవి ఉన్నట్టే తాగుతాం. అలా తాగితేనే అవి బాగుంటాయి కూడా.
కానీ ఎవరైనా కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలపడం చూశారా..? వాక్.. అదేం కాంబినేషన్ అనుకుంటున్నారా..? కానీ ఇటీవల ఓ వ్యక్తి కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలిపి ఇంటర్నెట్‌లో ఫ్యామస్ అయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే.. అరుణ్ దేవ్ అనే ఓ ట్విటర్ యూజర్.. తాను కొబ్బరి బోండాంలో నిమ్మరసాన్ని కలుపుతూ దిగిన ఓ ఫొటోను తన మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేశాడు.
ఆ ఫొటోకు ‘ఇది ఇంత పాపులర్ కాంబినేషన్ అని నాకు ఇప్పటిదాకా తెలియదు’ అంటూ ఇంగ్లిష్‌లో క్యాప్షన్ కూడా ఇచ్చాడు.
ఈ ఫొటో ప్రస్తుతం ట్విటర్‌లో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ ఫొటోను 1,13,100 మంది వీక్షించారు. 1100 మంది లైక్ చేశారు. పైగా కామెంట్ల వర్షం కురుస్తున్నది.
‘ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మంగళూరులో దీన్ని బోంబా లైమ్ అంటారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘ఇలాంటి కాంబినేషన్‌ను నేను అస్సలు ఊహించలేదు.
ఈ సారి మనం కొబ్బరిబోండాంలో ఓల్డ్ మంక్ రమ్ లేదా టెక్విలా కలిపి చూద్దాం’ అని ఇంకో నెటిజన్ కామెంట్ పెట్టాడు.
‘దీనికి కొంచెం ఉప్పు కలిసి తీసుకుంటే సూపర్ ఉంటది’ అని మరో ట్విటర్ యూజర్ రిప్లై ఇచ్చాడు.
0 Comments:
Post a Comment