సెకన్లో పుట్టి.. మరుసెకన్‌లో విడిపోతున్న ప్రేమ జంటలు ఉన్న ప్రస్తుత కాలంలో.. ఓ జంట ప్రేమ గాథ అందరిచే ఔరా అనిపించుకుంటుంది. శ్రీరాముడు తండ్రికి ఇచ్చిన మాట కోసం 14 ఏళ్లు వనవాసం చేస్తే..
కులం పేరుతో పెళ్లి నిరాకరించిన తల్లిదండ్రుల అనుమతి కోసం ఈ మహిళ ఏకంగా 22 ఏళ్లు ఎదరు చూసింది. చివరకు తన ఎదరుచూపులకు ఫలితం దక్కింది.
నిజమైన ప్రేమ విజయం సాధించింది. ఎట్టకేలకు ఆమె ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించేందుకు పెద్దలు అంగీకరించారు. ఈ సక్సెస్‌ఫుల్ లవ్ స్టోరీ వెనుక చాలా హిస్టరీనే ఉంది. అదేంటో ఇప్పుడు మీకోసం..
ప్రేమంటే అట్టాంటి ఇట్టాంటి ప్రేమ కాదు వారిది. నాలుగు కబర్లు చెప్పుకుని, సోషల్ మీడియాలో అర్థరాత్రి వరకు చాటింగ్స్, పార్కులు, పబ్బులు, ఓయో రూమ్స్‌కి వెళ్లే టైమ్ పాస్ ప్రేమకాదు వారిది.
జీవితాంతం ఒకరికి ఒకరు తోడు, నీడగా జీవించాలనుకున్న ప్రేమ. నిజమైన, నిస్వార్థమైన, అంకితభావంతో కూడిన ప్రేమ వారిది. అచంచలమైన ప్రేమ వారిది.
అందుకే ప్రేమించిన వాడితో పెళ్లి కోసం ఆమె ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 22 ఏళ్లు ఎదురు చూసింది. వారి ప్రేమ ముందు కాలమే బలాదూర్ అయ్యింది. ఇక పెద్దమనుషులు ఎంత. చివరకు వారిద్దరి పెళ్లి ఫిక్స్ అయ్యింది.
సాధారణంగానే మన దేశంలో ప్రేమ పెళ్లిళ్లను ఎవరూ అంగీకరించరు. కులం, మతం, ఫైనాన్షియల్ స్టేటస్ వంటి కారణాలతో ప్రేమ పెళ్లిళ్లకు నో చెబుతారు.
ఫలితంగా చాలా మంది ప్రేమికులు కుటుంబం కోసం, పరువు కోసం అని పేరెంట్స్ చూపించిన వారిని పెళ్లి చేసుకుని జీవితంలో సర్దుకుపోతుంటారు.
సోనియా ప్రేమ జీవితంలో కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. కానీ, తాను సర్దుకుపోలేదు. తల్లిదండ్రులు కులం పేరుతో ప్రియుడితో పెళ్లికి నిరాకరించగా.. చేసుకుంటే అతన్నే చేసుకుంటా, లేదంటే ఇలాగే ఉంటానంటూ బీష్మించుకు కూర్చింది.
ప్రియుడితో పెళ్లి కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తానంటూ 22 ఏళ్లు ఎదరు చూసింది. చివరకు ఆమె పట్టుదల, ప్రేమ నెగ్గింది. కులాంతర వివాహానికి కుటుంబ సభ్యులు అనుమతి ఇచ్చారు.
ఇంకేముంది.. ప్రేమ జంట కళ్లలో ఆనందం వెళ్లివిరిసింది. వారి ప్రేమ కథకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసింది సోనియా. పెళ్లికి సిద్ధమవుతున్నట్లు ఆనందం వ్యక్తం చేసింది.
ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంది. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ వీడియోకు 6 మిలియన్లకుపైగా లైక్స్ వచ్చాయి.
0 Comments:
Post a Comment