Beauty of Vanjangi: శీతాకాలం వచ్చిందంటే చాలు పర్యాటకులు వంజంగికి పోటెత్తుతున్నారు. ఇక్కడి మంచు అందాలను చూసేందుకు టూరిస్టులు క్యూ కడుతున్నారు.
ఇక్కడి దట్టమైన పొగమంచును చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. ఇక్కడ అందాలను చూసి మంత్రముగ్దులవుతున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని గ్రామమే వంజంగి. ఇది ప్రకృతి అందాలకు కేరాఫ్ అనే చెప్పాలి.
కొద్ది సంవత్సరాలు క్రితమే ఈ ప్రాంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ గిరి శిఖరాలను తాకుతూ ప్రవహించే మంచు అందాల చూపురులను కట్టిపడేస్తాయి.
ఈ వంజంగి హిల్స్ పై సూర్యోదయం చూడటానికి రెండు కళ్లు చాలవు. నిజంగా మీరు చూస్తే వావ్ అనకుండా ఉండలేరు. అందుకే దీనిని స్థానికులు 'మేఘాల కొండ' అని పిలుస్తారు.
ఆంధ్రా కశ్మీర్ గా పిలిచే లంబసింగికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఈ ఫేమస్ స్పాట్ ఉంది. అంతేకాకుండా వంజంగి దగ్గరలోని ఫేమస్ వాటర్ ఫాల్ అయిన కొత్తపల్లి జలపాతం కూడా ఉంది.
పాల సముద్రాన్ని తలపించే వంజంగి మంచు అందాలను చూసేందుకు అర్ధరాత్రి నుంచే పర్యాటకులు బారులు తీరుతున్నారు. ఈ అద్భుతాన్ని చూడాలంటే మన కాళ్లకు పనిచెప్పాల్సిందే.
మన వ్యూ పాయింట్ చేరుకోవాలంటే సుమారు 5 కిలోమీటర్లు ట్రెక్ చేయాల్సి ఉంటుంది.. అంతేకాకుండా ఇక్కడ స్టే చేయడానికి రిసార్ట్స్ ఉన్నాయి.
ఇక్కడ ప్రభుత్వం మరిన్ని సదుపాయాలు కల్పిస్తే టూరిస్టులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.
ఇక్కడకు రావాలనుకునేవారు ముందుగా ఫైట్ లో గానీ, ట్రైన్ లో గానీ, బస్సులో గానీ విశాఖపట్నం చేరుకోవాలి. అక్కడి నుంచి బస్సు లేదా ప్రైవేట్ వెహికల్స్ ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.
0 Comments:
Post a Comment