సికిల్ సెల్ ఎనీమియా అంటే ఎర్ర రక్త కణాల పరిమాణం మారుతూ ఉండే ఓ రక్త సంబంధ వ్యాధి. ఎర్ర రక్త కణాలు గుండ్రటి షేప్ నుంచి కొడవలి ఆకారంలో తయారై రక్త నాళాల్లో పూడికలకు దారితీస్తాయి.
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోగ్య రంగంలో కీలక ప్రకటన చేశారు. 2047 నాటికి సికిల్ సెల్ ఎనీమియా(రక్తహీనత)ను రూపుమాపేందుకు మిషన్‌ను ప్రకటించారు.
పోలియో తర్వాత ప్రభుత్వం ఈ వ్యాధి కట్టడిపై దృష్టి సారించి ఈ వ్యాధిని వీలైనంత త్వరగా దేశం నుంచి తరిమికొట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది.
ఈ మిషన్‌లో భాగంగా ప్రజల్లో సికిల్ సెల్ ఎనీమియాపై అవగాహనం కల్పించడం, గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో 40 ఏండ్లలోపు వయసున్న ఏడు కోట్ల మందికి పరీక్షలు నిర్వహించడం వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టనుంది.
సికిల్ సెల్ ఎనీమియా అంటే..!
సికిల్ సెల్ ఎనీమియా అంటే ఎర్ర రక్త కణాల పరిమాణం మారుతూ ఉండే ఓ రక్త సంబంధ వ్యాధి. ఎర్ర రక్త కణాలు గుండ్రటి షేప్ నుంచి కొడవలి ఆకారంలో తయారై రక్త నాళాల్లో పూడికలకు దారితీస్తాయి.
ఇది శరీరం రక్తం తయారుచేయకుండా నిరోధించే జనెటిక్ వ్యాధి. ఈ వ్యాధి క్రమంగా శరీరంలో రక్త హీనతకు దారితీయడంతో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
లక్షణాలు
సికిల్ సెల్ ఎనీమియా కలిగిన పిల్లలు పుట్టినప్పటి నుంచి పలు వ్యాధుల బారిన పడతారు
నరాలు, కండరాల నొప్పులు
శరీరంలో వాపు
తరచూ ఇన్ఫెక్షన్లకు లోనవడం
తరచూ రక్తాన్ని మార్చాల్సి రావడం
కంటి చూపు సమస్యలు
చికిత్స
సికిల్ సెల్ ఎనీమియాను రక్త పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. ఈ వ్యాధి పూర్తిగా నయం కావడం సాధ్యం కాకపోయినా స్టెమ్ సెల్, బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్‌తోనే సికిల్ సెల్ వ్యాధిని నయం చేయవచ్చు. ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు, కొన్ని లిక్విడ్ల ద్వారా లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చు.
2015, 2016 మధ్య చేపట్టిన కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం పిల్లల్లో 58.4 శాతం, మహిళల్లో 53 శాతం మంది ఈ వ్యాధి బారినపడ్డారు.
ఇక దేశ గిరిజన జనభాలో 3 శాతం మంది సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్నారని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. మరో 23 శాతం మంది ద్వారా జన్యు పరంగా ఈ వ్యాధి విస్తరించింది.
1970ల నుంచి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా 2018లో భారత్‌లో ఈ వ్యాధి వేగంగా ప్రబలింది.
2047 నాటికి రక్తహీనతను నిర్మూలించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించుకుంది. అయితే ఈ మిషన్‌ను ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకవెళుతుందనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
2018లో కేంద్రం ఎనీమియా ముక్త భారత్ వ్యూహం రూపొందించింది. ఈ మిషన్‌లో భాగంగా పోషకాహారం సమకూర్చడం, ఎనీమియా చికిత్సలో భాగంగా పరీక్షలు ముమ్మరంగా చేపట్టి, పోర్టిఫైడ్ ఆహార పదార్ధాలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది.
0 Comments:
Post a Comment