ఇలవైకుంఠంగా పిలువబడే ఏడుకొండల్లో పురాణ ప్రాశస్త్యం ఉన్న తీర్ధాలు ఎన్నో ఉన్నాయి. ఏడు కొండలు సాక్షాత్తు శ్రీనివాసుడి సయన రూపం పోలి ఉండే ముఖం కలిగి ఉండడమే ఎంతో విశిష్టత.
ఆనంద నిలయంలో సాలగ్రామ శిలగా అవతరించిన శ్రీనివాసుడి గురించి ఎంత విన్నా తనివి తీరదు.
లోక కళ్యాణార్ధం వైకుంఠంను వీడి భువిపై వెలసిన మహావిష్ణువు నడయాడిన పుణ్యస్ధలంలో మూడు లక్షలకు పైగా తీర్ధాలు ఉన్నట్లు స్కందపురాణం, వెంకటాచల మహత్యం, పురాణాలు, ఇతిహాసాలల్లో వర్ణించబడింది.
ఇందులో రామకృష్ణ తీర్దం,పాండవతీర్ధం, పాపవినాశనం, కుమారధారా తీర్ధం,తుంబురతీర్ధం, ఆకాశగంగ తీర్ధం,చక్రపుణ్యతీర్ధం, సనకసనందన తీర్ధం వంటికి అతి ముఖ్యమైనవిగా చెప్పుబడుతుంది.
సనకసనందన తీర్ధం తిరుమల(Tirumala) పుణ్యక్షేత్రం నుండి 12 కిలో(12km) మీటర్ల దూరంలో నెలవైయుంది. అసలు సనకసనంద తీర్ధం(Sanakasananda Theertham) సందర్శిస్తే కలిగే కలిగే ఫలితాలు ఏంటంటే..?
తిరుమల కొండల్లో నెలవైన తీర్ధం..
శేషాచలం కొండల్లో కొలువైయున్న తీర్ధాల్లో సనకసనంద తీర్ధం ప్రాముఖ్యత కలిగిన తీర్ధంగా చెప్పబడితుంది. మానవ సృష్టి కొరకు బ్రహ్మ దేవుడి చేత సృష్టించబడిన బ్రహ్మ మానస పుత్రులు స్వయంగా తపస్సు ఆచరించిన ప్రదేశమే సనకసనంద తీర్ధం.
బ్రహ్మ మానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు మిక్కిలి జ్ఞానసంపన్నులు. తమ తపశ్శక్తితో చూచుటకు చిన్న పిల్లలు వల్లె కనిపించినప్పటికీ, ఒక నాడు బ్రహ్మ మానస పుత్రులి విష్ణువుని దర్శించుటకు వైకుంఠంకు వెళ్ళగా, ద్వార పాలకులైన జయ-విజయులు వారిని విష్ణు దర్శనానికి నిరాకరిస్తారు.
దీంతో ఆగ్రహించిన బ్రహ్మ మానస పుత్రులు జయ-విజయులను "దైవత్వము కోల్పోయి భూలోకమున జన్మించునట్లు శపిస్తారు". ఆ తరువాత జయ-విజయులు విష్ణువును ప్రాధేయ పడి శాపం తోలగునట్లు చేయమని కోరతారు.
దానికి విష్ణువు శాపము అనివార్యము కానీ మీ శాప విమోచామునకు ఒక ఉపాయము చెప్పినట్లుగా పురాణాలు చెబుతున్నాయి.
శాప విమోచనం..
జయ-విజయులు "విష్ణువునకు శత్రువులుగా మూడు జన్మలు జన్మించటం లేదా ఏడు జన్మలు విష్ణు భక్తులుగా జన్మించటం మాత్రమే మార్గం ఉందని సెలవు ఇవ్వడంతో జయ-విజయులు ఇద్దరు త్వరగా విష్ణు సాన్నిధ్యం చేరుకోవాలి అంటే, తాము మూడ జన్మలు విరోధులుగా పుట్టినా పర్వాలేదు అని తలచి, ఈ మూడు జన్మలలోనూ తాము విష్ణువు చేతిలోనే మరణంను పోద్దునట్లు కూడా వరాన్ని పొందుతారు.
జయ-విజయులు మూడు జన్మలలో మొదటి జన్మలో (కృత యుగంలో ) హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు గాను, రెండవ జన్మ లో (త్రేతా యుగంలో) రావణ, కుంభకర్ణ గాను, మూడవ జన్మలో శిశుపాలుడు, దంతవక్రులు గాను జన్మించి తిరిగి విష్ణు సాన్నిధ్యాన్ని చేరారు.
బ్రహ్మ సిద్దాంత జ్ఞానం సిద్దిస్తుంది..
అయితే విష్ణువు దర్శనం కలుగక పోవడంతో శేషాచలంలోని పాపవినాశనంకు మూడు మైళ దూరంలో ఓ గృహలో ఘోర తపస్సును ఆచరించి విష్ణువును సాక్షాత్కారం పొందుతారు.
ఆనాటి ఆనవాళ్ళు నేటి ఆనవాళ్ళు నేటికి సనకసనందన తీర్ధంలో కనిపిస్తూ ఉండడం విశేషం.
సనకసనందన తీర్ధంను మార్గశిక శుక్లపక్ష ద్వాదశినాడు స్నానం చేస్తే సిద్ధి పొందుతారని, ఇక్కడి ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. లక్షలాది భక్తులు ప్రతి నిత్యం సనకసనంద తీర్ధం చేరుకుని సిద్ది పొందుతుంటారు.
0 Comments:
Post a Comment