ప్రపంచంలోని అనేక హిందూ దేవాలయాలు వాటి శిల్ప సౌందర్యంతో పాటు అనేక రహస్యాల కారణంగా ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి.
ఇస్లామిక్ దేశమైన ఇండోనేషియాలో సముద్రం మధ్యలో ఉన్న 'తానా లోట్' దేవాలయం వీటిలో ఒకటి.
ఈ ఆలయానికి విషసర్పాలు కాపలాగా ఉంటాయని చెబుతారు. ఈ ఆలయం సముద్ర తీరంలో ఉన్న పెద్ద రాతిపై నిర్మించారు. ఇది సుమారు 600 సంవత్సరాల పురాతన ఆలయం.
స్థానిక భాషలో 'తనా లోట్' అంటే సముద్ర భూమి అని అర్థం. ఈ ఆలయ శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది.
ఇండోనేషియా సందర్శించే వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. చరిత్ర ప్రకారం చూస్తే 15వ శతాబ్దంలో నిరర్థ అనే పూజారి బీచ్‌లో నడుస్తూ ఈ ప్రాంతానికి వచ్చాడు.
ఈ ప్రదేశంలోని ప్రకృతి సౌందర్యం అతన్ని అమితంగా ఆకర్షించింది. దీంతో అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు.
ఆ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించడానికి మత్స్యకారుల సహాయం తీసుకున్నాడు. సముద్రంలో నిర్మించిన ఈ ఆలయ భద్రతకు విషసర్పాలు కాపలాకాస్తాయని చెబుతారు.
అవి చొరబాటుదారుల నుంచి ఆలయాన్ని కాపాడతాయని అంటారు. ఆ పూజారి తన శక్తితో భారీ సముద్రపు పామును సృష్టించాడని, అది ఇప్పటికీ ఈ ఆలయాన్ని కాపాడుతుందని స్థానికులు చెబుతుంటారు.
0 Comments:
Post a Comment