మిగిలిపోయిన టీ ని మళ్లీ వేడి చేసి తాగుతున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.. !
ఒక్కపూట టీ తాగకుంటే గాయి గాయి చేసేవాళ్లు చాలా మందే ఉంటారు. ప్రస్తుత కాలంలో చాలా మందికి ఈ టీ వ్యసనం లా అలవాటు అయ్యింది. రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల టీని తాగితే ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి.
అయినా ఈ రోజుల్లో టీ అలవాటు లేని వారు అసలే ఉండరు. ఆఫీసుల్లో, ఇతర పనులు చేసేవారైతే రోజుకు ఐదార్లు సార్లైనా టీని తాగుతుంటారు. టీ మనల్ని యాక్టీవ్ గా ఉంచుతుంది. అయితే పాల టీ కంటే గ్రీన్ టీ, బ్లాక్ టీ లు మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని రక్షించడానికి సహాయపడతాయి. పాలు, టీ పౌడర్ తో తయారుచేసే టీ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా హాని చేస్తుంది. మీకు తెలుసా ఒకసారి తయారుచేసిన టీని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగడం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
మిగిలిపోయిన టీని వేడి చేయడం వల్ల దాని రుచి మారుతుంది. అలాగే వేడి చేసిన ప్రతిసారీ దాని రంగు కూడా మారుతుంది. అంటే ఆ టీలో కెఫిన్ కంటెంట్ బాగా పెరుగుతుందని అర్థం. ఈ టీ మీ శరీరానికి ఎన్నో సమస్యలను కలిగిస్తుంది. అయితే టీ రుచిని పెంచడానికి అల్లం, ఇలాచీ, దాల్చినచెక్క, యాలకులు, లవంగం వంటి అనేక రకాల వస్తువులను ఉపయోగిస్తుంటాం. ఇవి శరీరాన్ని రక్షించడానికి సహాయపడతాయి. అసలు టీని వేడి చేసి తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
జీర్ణక్రియ నెమ్మదిస్తుంది
టీని ఒకటి కంటే ఎక్కువ సార్లు వేడి చేయడం వల్ల దానిలో ఉండే అన్ని ఖనిజాలు, సమ్మేళనాలు వాటి పోషణను కోల్పోతాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కడుపునొప్పి, జీర్ణక్రియలో ఇబ్బంది, బరువు, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. టీని చాలా సేపటి తర్వాత తిరిగి వేడి చేయడం వల్ల బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు టీలో పెరుగుతాయి. ఇలాంటి టీని తాగడం వల్ల శరీరంలో ఎన్నో సమస్యలు వస్తాయి. క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది.
ఎసిడిటీ, తలనొప్పి
పొద్దున కాచిన టీని సాయంత్రం, రాత్రి అంటూ పదే పదే వేడి చేసి తాగకూడదు. దీనిలో కెఫిన్ కంటెంట్ పెరుగుతుంది. అలాగే దీని రుచి కొద్దిగా ఆస్ట్రిజెంట్ ఫీలింగ్ ను కలిగిస్తుంది. దీనివల్ల కడుపులో యాసిడ్ వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు పరిగడుపున లేదా కేవలం టీ తీసుకోవడం వల్ల కూడా ఎసిడిటీ సమస్య వస్తుంది. గుండెల్లో మంట కూడా కలుగుతుంది.
పార్కిన్సన్ వ్యాధి ప్రమాదం
రీసెర్చ్ గేట్ ప్రకారం.. పార్కిన్సన్ వ్యాధి న్యూరాన్లపై ప్రభావం చూపుతుంది. ఇది క్రమంగా మన జ్ఞాపకశక్తిని, ఆలోచించే వేగాన్ని తగ్గిస్తుంది. టీని ఎక్కువగా తాగడం, తిరిగి వేడి చేయడం వల్ల ఈ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మలబద్ధకం, కండరాల తిమ్మిరి, మాట్లాడటంలో తడబాటు వంటి సమస్యలను ఫేస్ చేస్తుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
ప్రీ ఎక్లాంప్సియా
ప్రీ ఎక్లాంప్సియా అనేది గర్భధారణ రుగ్మత. ఇది రక్తపోటుకు సంబంధించినది. ఈ వ్యాధి ఎక్కువగా గర్భిణీ స్త్రీని 20 వారాల తర్వాత మాత్రమే ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి గర్భిణీ స్త్రీల ఊపిరితిత్తులు, కాలేయంపై దాడి చేస్తుంది. నిజానికి గర్భిణీ స్త్రీలు రోజులో ఎక్కువ సార్లు టీని తాగుతుంటారు. రీసెర్చ్ గేట్ ప్రకారం.. గర్భిణీ స్త్రీలలో 3 నుంచి 10 శాతం ఈ కేసులు కనిపిస్తాయి. టీలో కనిపించే అనేక అంశాలు శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 8,370,000 ప్రీ ఎక్లాంప్సియా కేసులు ఉన్నాయి.
0 Comments:
Post a Comment