✍️పాఠాలు సరిగా చెప్పడం
లేదని మరో టీచర్ సస్పెన్షన్
♦️ఇంకో ఇద్దరికి షోకాజ్ నోటీసులు
🌻చిత్తూరు (సెంట్రల్), ఫిబ్రవరి 15: విధులు సరిగా నిర్వర్తించడం లేదంటూ జిల్లాలో టీచర్ల మీద ప్రభుత్వ చర్యలు పెరిగాయి. ఒక టీచర్‌ను సస్పెండ్ చేసి, ఇద్దరికి షోకాజ్ జారీ చేసిన డీఈవో విజయేంద్రరావు బుధవారం తవణంపల్లె మండలం మల్లకుంట ఎంపీపీఎస్‌లో ఎస్జీటీగా పనిచేస్తున్న ఎస్‌సీ రాజేష్‌కుమార్‌ను సస్పెండ్ చేశారు. పాఠాలు సరిగా చెప్పకపోవడం, తరచూ సెలవులు పెట్టడం, విద్యార్ధుల మార్కులు ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడం వంటి కారణాలను పేర్కొన్నారు. కాగా పాఠాలు సరిగా చెప్పకపోవడంతో పాటు రికార్డులు సరిగా నిర్వహించలేదని, జవాబు పత్రాలు దిద్దలేదని తవణంపల్లె మండలంలోని కృష్ణంపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో స్కూల్ అసిస్టెంట్ సుహాసినికి, ఎంపీపీఎస్‌లో ఎస్జీటీ బీఎం.రఘుపతిరెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
0 Comments:
Post a Comment