హెచ్‌ఎం, ఎండిఎం ఇన్‌ఛార్జి టీచర్ సస్పెన్షన్..
మక్కువ: మండలంలోని కోన యుపి పాఠశాలలో ఆహారం కలుషితమై జరిగిన తదనంతర పరిణామాలపై ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్‌డివి రమణ కఠిన చర్యలు చేపట్టారు.
శుక్రవారం స్థానిక ఎంఇఒ వి.మల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం కోన యుపి పాఠశాలలో జరిగిన ఘటనలు ఆధారంగా ఆ పాఠశాల హెచ్‌ఎం పి.జయకుమార్, ఆరోజు మిడ్ డే మీల్స్ ఇన్చార్జిగా వ్యవహరించిన టీచర్ వి.సూరిబాబును సస్పెండ్ చేసినట్లు డిఇఒ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న ఏజెన్సీని రద్దు చేస్తున్నట్లు ఆదేశాలొచ్చాయన్నారు. కొత్త ఏజెన్సీను ఎండిఎం బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. అలాగే కొత్తగా డిప్యూటేషన్‌పై ఇద్దరు ఉపాధ్యాయులను కూడా పాఠశాలకు నియమించారని ఎంఇఒ తెలిపారు.
ఎండిఎం పర్యవేక్షణకు రోజుకు ఒక టీచర్
ఇకపై జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం పరిశీలనకు స్థానిక పాఠశాల నుంచి రోజుకొక ఉపాధ్యాయుడ్ని నియమిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్‌డివి రమణ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఎండిఎం నిర్వహణపై ప్రతి పాఠశాలలోనూ ప్రత్యేక అవగాహన కార్యక్రమం కూడా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
కొత్త హెచ్‌ఎంగా జగదీష్‌కు బాధ్యతలు
కోన ప్రాథమిక పాఠశాల నూతన హెడ్మాస్టర్‌గా గణితం బోధకులు జగదీష్‌కు బాధ్యతలు అప్పగించనున్నట్లు ఎంఇఒ తెలిపారు. తాత్కాలికంగా పాఠశాల బాధ్యతలు నిర్వహణ ఆయన చేపడతారని తెలిపారు.
ఎంఇఒకు షోకాజ్ నోటీస్
కోన పాఠశాలలో జరిగిన సంఘటనకు సంబంధించి మండల విద్యాశాఖ అధికారి వి.మల్లేశ్వరరావుకు కూడా షోకాజ్ నోటీసును జిల్లా విద్యాశాఖ అధికారి జారీ చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించి సమగ్ర వివరణ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది. అలాగే పాఠశాలలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై కూడా చర్యలు తీసుకోవడంలో విఫలమైన దానికి సంబంధించి కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది
0 Comments:
Post a Comment