Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
సూపర్ బ్రెయిన్ యోగా అనేది మానసిక స్పష్టత, ఏకాగ్రత మరియు మొత్తం మెదడు పనితీరును మెరుగుపరచడానికి చాలా సంవత్సరాలుగా ఉపయోగించబడుతున్న సులభమైన అలాగే అత్యంత శక్తివంతమైన టెక్నిక్.
ఇది ఇయర్ లోబ్స్ టెంపుల్స్ లో ఉన్న పీడన బిందువుల ఉద్దీపనను కలిగిస్తుంది. ఆక్యుప్రెషర్, యోగా సూత్రాలపై ఆధారపడి ఉంటుంది.
సూపర్ బ్రెయిన్ యోగా ఎలా చేయాలి, దాని వల్ల ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం
సూపర్ బ్రెయిన్ యోగా ఎలా చేయాలి:
నేలపై లేదా కుర్చీలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. కుడి చేతి బొటన వేలు, చూపుడు వేలితో ఎడమ ఇయర్ లోబ్‌ను నెమ్మదిగా నొక్కాలి. అలా కొన్ని సెకన్ల పాటు నొక్కాలి. ఇప్పుడు ఎడమ చేతి బొటన వేలు, చూపుడు వేలితో కుడి చెవి ఇయర్ లోబ్‌ను నెమ్మదిగా కొన్ని సెకన్ల పాటు నొక్కాలి. తర్వాత కుడి బొటన వేలు అలాగే చూపుడు వేలితో తల కుడి వైపు, చెవికి ఎగువన ఉన్న టెంపుల్‌ను గట్టిగా నొక్కాలి. కొన్ని సెకన్ల తర్వాత వదిలిపెట్టాలి. అలాగే ఎడమ వైపు కూడా అలాగే చేయాలి.
సూపర్ బ్రెయిన్ యోగా ప్రయోజనాలు:
సూపర్ బ్రెయిన్ యోగా వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. మానసిక స్పష్టత వస్తుంది.
జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది.
నేర్చుకునే శక్తి పెరుగుతుంది.
ఒత్తిడి తగ్గుతుంది
ఆందోళన తగ్గుతుంది
మంచి నిద్ర పడుతుంది.
సూపర్ బ్రెయిన్ యోగా ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందాలంటే దానిని క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తుండాలి. మెదడు పనితీరును పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి ప్రతి రోజూ సూపర్ బ్రెయిన్ యోగా చేయడం మంచిది.
సూపర్ బ్రెయిన్ యోగా అనేది మొదడు పనితీరు, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సులభమైన, సురక్షితమైన, సమర్థవంతమైన మార్గం. బ్రెయిన్ యోగా చేయడం చాలా సులువు. దీనిని ఎక్కడైనా చాలా సులభంగా చేయవచ్చు. ఇది అన్ని వయస్సుల వారికి అనుకూలంగా ఉంటుంది. జ్ఞాపక శక్తిని మెరుగుపరచుకోవాలని, ఒత్తిడిని తగ్గించుకోవాలని అనుకునే వారు, మెదడు పనితీరు పెంచుకోవాలని చూస్తున్నా సూపర్ బ్రెయిన్ యోగా చాలా అద్భుతమైన ఎంపిక అవుతుంది.
0 Comments:
Post a Comment